close

తాజా వార్తలు

జైపూర్‌లో ‘పానిపత్‌’ ప్రదర్శన నిలిపివేత

జైపూర్‌: అర్జున్‌ కపూర్‌ కథానాయకుడిగా అశుతోష్‌ గొవారికర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘పానిపత్‌’. రాజస్థాన్‌ జైపూర్‌లోని థియేటర్‌లలో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. జాట్‌ వర్గీయుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల యాజమాన్యం తెలిపింది. ఈ చిత్రాన్ని వెంటనే నిషేధించాలని రాజస్థాన్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్‌ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. 

అసలేం జరిగిందంటే.. 

మూడో పానిపత్‌ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో మరాఠా యోధుడు సదాశివరావ్‌గా అర్జున్‌ కపూర్‌, ఆయన భార్య పార్వతీ భాయ్‌గా కృతిసనన్‌, అఫ్గానిస్థాన్‌ సైన్యాధిపతి అహ్మద్‌ షా అబ్దాలి పాత్రలో సంజయ్‌ దత్‌ నటించారు. అయితే, ఈ సినిమాలో జాట్‌ మహారాజు సూరజ్‌మాల్‌ పాత్రను తప్పుగా చిత్రీకరించారని.. వెంటనే ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని కోరుతూ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో జాట్‌లు నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా దర్శకుడు అశితోష్‌ గొవారికర్‌ దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు.

మరోవైపు రాజస్థాన్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్‌ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘‘పానిపత్‌’ చిత్రంలో భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మహారాజా సూరజ్‌మాల్‌ పాత్రను తప్పుగా చూపించడం చాలా బాధాకరమైన విషయం. హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ సినిమాపై వెంటనే బ్యాన్‌ విధిస్తారని భావిస్తున్నారు. ఈ సినిమాలో చరిత్రను సరిగ్గా చూపించలేదు. మహారాజా సూరజ్‌మాల్‌ కుటుంబంలో 14 తరానికి చెందిన వ్యక్తిని నేను. యుద్ధంలో ఓడిపోయాక  పీష్వా సైన్యం  తీవ్రగాయాలతో పానిపత్ నుంచి తిరిగి వచ్చాయి. ఆ సమయంలో మహారాజా సూరజ్‌మాల్‌, మహారాణి కిషోరి.. వారికి కొన్ని నెలలపాటు ఆవాసం ఇచ్చారు. ఏదైనా రాజ్యానికి, గొప్ప వ్యక్తులకు సంబంధించిన చిత్రాలను తెరకెక్కించే ముందు సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకునే విధంగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.