close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 28/02/2020 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఖైదీ’గా అజయ్‌దేవగణ్‌

ప్రకటించిన నిర్మాత

ముంబయి: కోలీవుడ్‌ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన విభిన్న కథా చిత్రం ‘ఖైదీ’. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో కార్తీ నటనను అభిమానులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఖైదీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే మాతృకలో కార్తీ పోషించిన పాత్రలో ఎవరు నటిస్తారనే ప్రశ్నకు శుక్రవారం సమాధానం దొరికింది. ‘ఖైదీ’ రీమేక్‌లో అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు చిత్ర నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, ఏడీఎఫ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ‘ఖైదీ’ రీమేక్‌లో అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారని ప్రకటించడం మాకెంతో సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని ఎస్‌.ఆర్‌.ప్రభు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అజయ్‌ దేవగణ్‌ సైతం ట్విటర్‌ వేదికగా తాను ‘ఖైదీ’ రీమేక్‌లో నటిస్తున్నానని తెలిపారు. 

కోలీవుడ్‌లో ‘ఖైదీ’ చిత్రాన్ని లోకేశ్‌ కనకరాజు తెరకెక్కించారు. కూతుర్ని చూడాలనుకునే తండ్రి ఆరాటం, తండ్రిని కలవాలనుకునే కూతురి తపన.. లాంటి భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ డిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపించి మెప్పించారు. త్వరలో ఈ సినిమాకి సీక్వెల్‌ రానున్నట్లు లోకేశ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరి బాలీవుడ్‌ రీమేక్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.