close

తాజా వార్తలు

ప్రేమ పెళ్లి చేసుకోనున్న నితిన్‌..?

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు నితిన్ ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరి వివాహం జరగనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. నితిన్‌ కొంతకాలంగా ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో ఉన్నారట. దీంతో నితిన్‌ కుటుంబసభ్యులు తర్వలోనే వీరిద్దరికి వివాహం చేయాలని భావిస్తున్నారట. ఈ తరుణంలో వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనుందట. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం దుబాయ్‌లో జరగొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి రుమార్స్‌పై నితిన్‌ స్పందించాల్సి ఉంది.

ప్రస్తుతం నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక కథానాయిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ గ్లిమ్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.