
తాజా వార్తలు
వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి: నటి
ఫేస్బుక్ పరిచయం.. దాడికి గురైన మాల్వీ మల్హోత్ర
ముంబయి: పెళ్లికి నిరాకరించిందని బుల్లితెర నటి మాల్వీ మల్హోత్రపై దాడికి పాల్పడి జైలుపాలైన యోగేష్ మహిపాల్‌కు బెయిల్ ఇచ్చేందుకు తాజాగా ముంబయి సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఫేస్బుక్ ద్వారా మాల్వీకి పరిచయమైన యోగేష్ అక్టోబర్ నెలలో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. హత్యాయత్నానికి ప్రయత్నించిన యోగేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యోగేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజాగా బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై బాధితురాలు మాల్వీ మాట్లాడుతూ..
‘‘అతనికి బెయిల్ నిరాకరించినందుకు నేనెంతో సంతోషిస్తున్నా. నా తరఫు కేసు వాదిస్తున్న న్యాయవాదికి ధన్యవాదాలు. క్రిమినల్ ఆలోచనలతో జీవించే యోగేష్ లాంటి మనుషులు జనారణ్యంలో ఉండకూడదు. అతనికి జీవితఖైదు పాడాలని ఆశిస్తున్నా. ఒకవేళ బెయిల్ వస్తే అతడు ముంబయి నుంచి పారిపోతాడు’’
‘‘నాపై దాడి జరిగిన నాటి నుంచి భయంతో బతుకుతున్నాను. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కోలుకుని మరలా సాధారణ జీవితంలోకి అడుగుపెట్టేలా చూడమని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఎన్నో సంవత్సరాలుగా నేను ముంబయిలోనే ఉంటున్నప్పటికీ ఇటీవల జరిగిన ప్రమాదం వల్ల బయటకు వెళ్లాలంటే భయపడుతున్నా. కానీ, ముంబయి పోలీసులు నాకు సపోర్ట్‌గా ఉన్నారు’’ అని తెలిపారు.