close

తాజా వార్తలు

మహేశ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. సంక్రాంతి సందర్భంగా వెండితెరపై ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మహేశ్‌ చేసే సందడి చూడటానికి ముందే ఆయనను నేరుగా చూసే అవకాశం కలగనుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటించింది. 

‘‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్‌ ప్రీరిలీజ్‌ వేడుక జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించబోతున్నాం. ఇక ఉత్సవాలు మొదలయ్యాయి’’ -చిత్ర బృందం.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసేంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి11న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.