close

తాజా వార్తలు

Updated : 30/10/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షెల్టర్‌ ఇచ్చినవాడే సైకో అయితే..!

ఉత్కంఠభరితంగా ‘గతం’ ట్రైలర్‌

హైదరాబాద్‌: సైకో నేపథ్యంతో సాగే ఎన్నో చిత్రాలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా అదే జోనర్‌లో మరో సరికొత్త సినిమా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యింది. ‘గతం’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌ 6న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. కిరణ్‌ కొండమడుగుల దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో భార్గవ్‌, రాకేశ్‌, పూజిత ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది.

ఓ ప్రమాదంలో గతం మర్చిపోయిన రిషికి.. అతిథి అనే అమ్మాయి దగ్గరవుతుంది. అయితే తన జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ రిషి తన ప్రేయసి అతిథితో కలిసి కారులో ఓ ప్రాంతానికి ప్రయాణమవుతాడు. మార్గమధ్యంలో కారు పాడైపోవడంతో  అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీరిద్దరికీ తన ఇంట్లో షెల్టర్‌ ఇస్తాడు. అక్కడికి వెళ్లాక సదరు వ్యక్తి సైకో అని రిషి-అతిథికి అర్థమవుతుంది. అంతేకాకుండా తాను గతం మర్చిపోవడానికి ఆ వ్యక్తే కారణమని రిషికి తెలుస్తోంది. మరి రిషి-అతిథి సైకో బారి నుంచి ఎలా బయటపడ్డారు? రిషి గతం మర్చిపోవడానికి గల కారణమేమిటి? అనేది తెలియాలంటే ‘గతం’ చిత్రం చూడాల్సిందే.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.