close

తాజా వార్తలు

ఆ కొరియోగ్రాఫర్‌ మహిళలను వేధిస్తున్నాడట..!

దిల్లీ: ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ తనను అశ్లీల చిత్రాలు చూడాలని బలవంతం చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్‌(33) పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఇండియన్‌ ఫిలిం, టెలివిజన్‌ కొరియోగ్రాఫర్‌ అసోసియేషన్‌(ఐఎఫ్‌టీసీఏ)కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణేశ్‌ ఆచార్య ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడట. గత కొంతకాలంగా ఆమెను శారీరకంగా వేధించడంతో పాటు అశ్లీల చిత్రాలు చూడాలని బలవంతం చేస్తున్నాడట. అంతేకాదు తనకు వచ్చే ఆదాయంలో కమీషన్‌ ఇవ్వాలని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జనవరి 26న ఐఎఫ్‌టీసీఏ కార్యాలయానికి వచ్చిన ఆ మహిళపై అసభ్యకరంగా నోరుపారేసుకోవడంతో పాటు అసోసియేషన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాడట.

అంతటితో ఆగకుండా.. ఆమెను చెంపపై కొట్టాలని జయశ్రీ అనే మహిళనూ బలవంతం చేసినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు ఆమె మహారాష్ట్రలోని అంబోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను సైతం కోరింది. గణేశ్‌ ఇంతకుముందు కూడా పలుమార్లు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో తన విషయంలోనూ ఈ కొరియోగ్రాఫర్‌ తప్పుడు ప్రచారం చేశాడంటూ నటి తనుశ్రీదత్తా గణేశ్‌పై ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఫిర్యాదుపై స్పందించాలని మహిళా కమిషన్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ను సంప్రదించగా ఎలాంటి సమాధానం రాలేదని ఉన్నతాధికారులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.