close

తాజా వార్తలు

Published : 20/09/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్టార్‌ హీరోయిన్‌ అయినా వారిని సంతోషపెట్టాల్సిందే!

బీటౌన్‌ క్యాస్టింగ్‌ కౌచ్‌పై కంగన వ్యాఖ్యలు

ముంబయి: సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అయినా సరే ఏదైనా సినిమాలో అవకాశం పొందాలంటే ఆ సినిమాకు పనిచేసే వారిలో కీలక వ్యక్తులను సంతోషపెట్టాల్సిందేనంటూ నటి కంగనా రనౌత్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి చెందిన నాటి నుంచి బీటౌన్‌పై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తోన్న కంగన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరోసారి బాలీవుడ్‌పై తనదైన శైలిలో మాటల బాణాలు సంధించారు. బీటౌన్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ ఇండస్ట్రీలో నటీమణులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు.

‘ప్రత్యేకంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి నేను ఈ మాటలు చెప్పడం లేదు. సాధారణంగా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెబుతున్నాను. ఏ లిస్ట్‌, బీ లిస్ట్‌, లేదా అతిపెద్ద సూపర్‌స్టార్స్‌ ఎవరైనా సరే.. సెట్‌లో ఉన్న నటీమణి తమతో ఓ భార్యలా ప్రవర్తించాలని ఆశిస్తారు. సినిమాలు మారతాయి.. హీరోలు మారతారు.. కానీ పరిస్థితి మాత్రం ఇలానే ఉంటుంది. ఇది నిజం. నాకు తెలిసి ఇండస్ట్రీలో జయాబచ్చన్‌ చాలా సురక్షితమైన నటీమణిగా ఉండుంటారు. ఎందుకంటే ఆమె వెనుక ఓ పవర్‌ఫుల్‌ మేన్‌ ఉన్నారు. నటిగా ఆమెకున్న అనుభవాన్ని నేను తప్పుబట్టడం లేదు. అలా అని ప్రవీణ్‌ బాబీ, జీనత్‌ అమన్‌లకు జరిగిన అన్యాయాన్ని మనం తిరస్కరించకుండా ఉండలేము కదా.’ అని కంగన వ్యాఖ్యానించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.