కొంతకాలం కరోనా అప్‌డేట్స్‌ చదవకండి
close
Published : 29/03/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొంతకాలం కరోనా అప్‌డేట్స్‌ చదవకండి

ప్రజలకు ప్రముఖ నిర్మాత విజ్ఞప్తి

ముంబయి‌: ప్రస్తుతం మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామనే విషయం అందరికీ తెలుసని బాలీవుడ్ నిర్మాత కరణ్‌ జోహర్‌ అన్నారు. కరోనా కల్లోలం నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు మాత్రం వాటిని పాటించడం మానేసి చాలా సాధారణంగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం కరోనావైరస్‌కు సంబంధించిన వార్తలు చదివి తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.

ఈ నేపథ్యంలో నిర్మాత కరణ్‌ జోహర్‌ ట్విటర్‌ వేదికగా ఓ స్పెషల్‌ ట్వీట్‌ పెట్టారు. ‘ఏం చెయ్యాలో మీకు తెలుసు! ఇది ఎంత ప్రమాదకరమైన సమయమో మీకు తెలుసు! స్వీయ నిర్బంధం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం.. వీటన్నింటి గురించి మీకు బాగా తెలుసు..!! కాబట్టి మీకోసం మీరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని రోజులపాటు కరోనా అప్‌డేట్స్‌ గురించి చదవకండి. నియమాలను పాటించండి. సంతోషంగా ఉండండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని