హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లేనని అంతా భావించారు. అయితే, చాన్నాళ్ల తర్వాత మేకప్ వేసుకున్న పవన్ ఇప్పటికే సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. హిందీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దిల్‌రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేధా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల కాల్ షీట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో ప్రతిరోజూ షూటింగ్ ఉంటున్న నేపథ్యంలో సమయాభావాన్ని తగ్గించేందుకు పవన్ కల్యాణ్‌కు ఆ సినిమా నిర్మాత దిల్‌రాజు ప్రత్యేక విమాన సదుపాయం కల్పించారని సమాచారం. ఇప్పటికే ఓ విమానయాన సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం దిల్‌రాజు దాదాపు రూ.కోటి ఖర్చు చేయనున్నారని సినీవర్గాల ద్వారా వినిపిస్తోంది. కాగా.. ఈ సినిమా షూటింగ్లో పవర్‌స్టార్ పాల్గొన్న కొన్ని ఫొటోలు బయటికి లీక్ అవడంతో పవర్‌స్టార్ ఆగ్రహం వ్యక్తం చేశారని, సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచాలని నిర్మాణ సంస్థకు ఆయన సూచించినట్లు సమాచారం.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ