close

తాజా వార్తలు

అతడు నా ముఖాన్ని నాశనం చేశాడు కానీ..!

‘ఛపాక్‌’ ట్రైలర్‌ విడుదల

ముంబయి: యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న సినిమా ‘ఛపాక్‌’. ‘పద్మావత్‌’ తర్వాత బాలీవుడ్‌ తార దీపికా పదుకొణె  నటిస్తున్న చిత్రమిది. ‘రాజీ’ ఫేం మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రశంసలు లభించాయి. మంగళవారం చిత్ర బృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి..’ అని యువత ఆందోళన చేస్తున్న డైలాగ్‌తో ఈ ప్రచార చిత్రం ఆరంభమైంది. ఓ యువకుడు అందమైన దీపిక (మాలతి) ముఖంపై యాసిడ్‌ చల్లడంతో తొలుత ఆమె మానసికంగా కుంగిపోయారు. ఆ పై న్యాయం కోసం ఆమె చేసిన పోరాటంతో కూడిన సన్నివేశాలు స్ఫూర్తిని నింపేలా ఉన్నాయి. ‘యాసిడ్‌ అమ్మడం ఆపేస్తే ఎంత బాగుంటుంది. ఈ దాడులు ఆగిపోతాయి’ అంటూ దీపిక ఆవేదన చెందారు. ‘అతడు నా ముఖాన్ని నాశనం చేశాడు.. నా ఆత్మవిశ్వాసాన్ని కాదు..’ అని దీపిక చివర్లో చెప్పడం హైలైట్‌గా నిలిచింది. లక్ష్మీ అగర్వాల్‌ 2005లో బస్టాండులో ఉండగా ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసి పారిపోయాడు. ఆమె తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆ వ్యక్తి అంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఈ నిజ జీవిత సంఘటనలతో తీసిన ‘ఛపాక్‌’ 2020 జనవరి 10న విడుదల కాబోతోంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.