INPICS: ఓనం వేడుకల్లో సెలబ్రిటీలు - Celebrities Onam Celebrations
close
Published : 31/08/2020 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INPICS: ఓనం వేడుకల్లో సెలబ్రిటీలు

హైదరాబాద్‌: మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ఓనం. ఆగస్టు-సెప్టెంబర్‌ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసంతోపాటు రకరకాల పిండి వంటలను చేసుకుని కుటుంబమంతా సంతోషంగా ఆరగిస్తారు.

అదేవిధంగా ఓనం సందర్భంగా ప్రజలు వారి ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని పూక్కలం అంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తారు. రంగవల్లులపై ఓనం రోజున పోటీలు కూడా నిర్వహిస్తారు. ఓనం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. మీరూ ఓ లుక్కేయండి మరి.

వర్ష బొల్లమ్మ


 

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని