మాహిష్మతిలో పండుగ వాతావరణం! - Celebrities Diwali Wishes
close
Published : 14/11/2020 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాహిష్మతిలో పండుగ వాతావరణం!

సురక్షిత‌ దీపావళి అంటోన్న తారలు

హైదరాబాద్‌: మాహిష్మతి సామ్రాజ్యం ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు మాహిష్మతి సామ్రాజ్యంలో దీపావళి వేడుకలు జరుగుతున్నట్లు ఉన్న ఓ ఫొటోని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. వెలుగుల పండుగను పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ సురక్షితమైన దీపావళిని జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. మరోవైపు ప్రముఖ నటుడు రజనీకాంత్‌.. పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు తన ఇంటివద్దకు చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు.

‘అందరికీ హ్యాపీ దీవాళి.!! ప్రేమ, నమ్మకం, సంతోషం అనే వెలుగులతో ఈ సమాజాన్ని ప్రకాశింపజేయడంతోపాటు కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కూడా కాపాడుకుందాం.’ - మహేశ్‌ బాబు

‘ప్రతిఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు..!! ప్రస్తుతం మనకు అవసరమైన శాంతి, సంతోషం, ఆరోగ్యంతో కూడిన వెలుగులు అందరి జీవితాల్లో ప్రసరించాలని కోరుకుంటున్నాను’ - అనసూయ

‘మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ ప్రియమైన వారికి దీపావళి శుభాకాంక్షలు!! సురక్షితంగా ఉండండి’ - వెంకటేశ్‌

‘హ్యాపీ ఏ మ్యూజికల్‌ దీపావళి టు ఆల్‌. వెలుగుల పండుగను సురక్షితంగా జరుపుకోండి. ప్రస్తుతం ఇబ్బందిపెడుతున్న వైరస్‌ త్వరితగతిన నశించి.. రానున్న తరాల కోసం ప్రపంచం మరింత సుందరంగా తయారు అవుతుందని ఆశిస్తున్నాను’ - దేవిశ్రీ ప్రసాద్‌

‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు!! ఇలాంటి క్లిష్టమైన సంవత్సరంలో.. ఈ దివ్వెల వెలుగులు మనకి మంచి దారిని చూపిస్తాయని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆర్థిక, భావోద్వేగభరితమైన కారణాల వల్ల చాలామంది ఈ ఏడాది సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థనలు చేయండి.’ - శ్రుతిహాసన్‌

‘నా వేడుక ఇలా ప్రారంభమైంది. ప్రేమ, శాంతి అనే దివ్వెలతో సమాజంలో వెలుగులు నింపండి. విషపూరితమైన ఆలోచనలు తొలగించి.. ప్రేమతో నిండిన హృదయాలకు ఆహ్వానం పలకండి. ప్రేమతో ఏదైనా సాధ్యం అవుతుంది. నా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు’ - నమ్రతా శిరోద్కర్‌

‘మీ జీవితంలో నెలకొన్న చీకట్లను తరిమేలా వెలుగులు నిండాలని ఆశిస్తున్నాను’ - రాధాకృష్ణ కుమార్‌

‘మీ జీవితం శాంతి, సంతోషం అనే రంగులద్దుకోవాలని ఆశిస్తున్నాను. హ్యాపీ దీపావళి’ - గోపీచంద్‌


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని