బజరంగీ ‘మున్నీ’.. ఇప్పుడిలా! - Bajrangi Bhaijan toddler in shocking avatar
close
Updated : 19/11/2020 08:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బజరంగీ ‘మున్నీ’.. ఇప్పుడిలా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘బజరంగీ భాయిజాన్’. 2015లో కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులతో పాటు బాక్సాఫీసునూ కొల్లగొట్టింది. అనంతరం జపాన్‌లోనూ విడుదలై విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. కన్నవారి వద్దకు చేర్చేందుకు ఓ భారతీయ యువకుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథ.  

తొలిచిత్రమే అయినా మాటలు రాని మూడేళ్ల చిన్నారి ‘మున్నీ’ పాత్రలో సల్మాన్‌తో పోటీగా నటించింది హర్షాలీ మల్హోత్రా. అమాయకమైన ముఖంతో ప్రేక్షకుల కంట నీరు పెట్టించిన ఆమెను అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు.

ఐతే తాజాగా దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా హర్షాలీ సామాజిక మాధ్యమాల్లో తన చిత్రాన్ని షేర్‌ చేసింది. దీనిని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. మున్నీ ఎంతగా ఎదిగిపోయిందోనని ఆశ్చర్యపోతున్నారు.. అభినందనలు తెలియచేస్తున్నారు. మరి ఆ చిత్రాలను మీరూ చూసేయండి..


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని