ఈసంక్రాంతికి ‘ఈటీవీ’లో సందడేసందడి - Attho Atthamma Kuthuro ETV Sankranthi Special Event
close
Published : 27/12/2020 00:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసంక్రాంతికి ‘ఈటీవీ’లో సందడేసందడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి పండగకీ తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తుంటుంది ‘ఈటీవీ’. అందుకోసం ప్రేక్షకులు కూడా ఈటీవీలో వచ్చే ప్రత్యేక కార్యక్రమం కోసం ఎదురుచూస్తుంటారు. ఇందులో భాగంగా ‘ఈటీవీ’ ఈసారి రెట్టింపు కనువిందు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి సంక్రాంతి రోజు అందర్నీ కడుపుబ్బా నవ్వించేందుకు ‘అత్తో అత్తమ్మ కూతురో’ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది.

‘‘ఒక అందమైన కుటుంబం.. ఆ కుటుంబానికి పెద్ద ఓ గడసరి అత్త. ఆ అత్తకు ఓ ముద్దుల మేనళ్లుడు. మరో ముగ్గురు అల్లరి అల్లుళ్లు, వీళ్ల ఇంటిపక్కనే ఓ కత్తిలాంటి అమ్మాయి. వీళ్లందరూ ఒకే ఇంట్లో కలిసి సంక్రాంతి పండగ చేసుకుంటే ఏ రేంజ్‌లో ఉంటుందో..?’’ అంటూ సాగే ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరి వాళ్లంతా ఇంట్లో ఎంత సందడి చేశారో తెలియాలంటే మాత్రం ‘అత్తో అత్తమ్మ కూతురో’ కార్యక్రమం చూడాల్సిందే మరి.

ఇదీ చదవండి..

ఆ సన్నివేశాలను తొలగించాం : పరుచూరిAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని