close

తాజా వార్తలు

బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్‌..?

హైదరాబాద్‌: ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్‌. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో కీలకపాత్రలను పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఓ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కునున్న చిత్రంలో శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారట. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు బాలకృష్ణ-బోయపాటి శ్రీను జోడీ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం ఇటీవల ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. దీంతో ఈ పాత్ర కోసం చిత్రబృందం శ్రీకాంత్‌ను తీసుకోవాలని భావిస్తుందట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే శ్రీకాంత్‌.. ‘యుద్ధం శరణం’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.