అప్పటి పాటే బాగుంది..
close
Published : 10/04/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పటి పాటే బాగుంది..

ట్వీట్‌ చేసిన సంగీత దర్శకుడు

ముంబయి: ఇటీవల విడుదలైన ఓ పాట గురించి ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌.రెహమాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిషేక్‌ బచ్చన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘దిల్లీ-6’. 2009లో విడుదలైన ఈ చిత్రానికి రాకేష్‌ ఓంప్రకాశ్‌ మిశ్రా దర్శకత్వం వహించారు. ‘దిల్లీ-6’ చిత్రంలోని ‘మసక్కలి’ అంటూ సాగే ఓ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం విధితమే. తాజాగా ఈ పాటను ‘మసక్కలి 2.0’ పేరుతో రీమేక్‌ చేశారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర, తారా సుతారియా కలిసి డ్యాన్స్‌ చేసిన ఈ పాటకు తనీష్క్‌ బగ్చీ సంగీతం అందించారు. అయితే ‘మసక్కలి 2.0’ కంటే ఒరిజినల్‌ ‘మసక్కలి’ పాట ఎంతో బాగుందంటూ నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ‘మసక్కలి 2.0’ గురించి రెహమాన్‌ స్పందించారు. తన ట్విటర్‌ ఖాతా వేదికగా.. ‘దిల్లీ-6’ సినిమాలోని ‘మసక్కలి’ పాటను రూపొందించడానికి తన బృందం ఎంతకష్టపడిందో తెలియచేశారు. ‘ఎలాంటి షార్ట్‌ కట్స్‌ లేవు. ఎన్నో నిద్రలేని రాత్రులు. రైట్స్‌ అండ్‌ రీ రైట్స్‌. దాదాపు 200 మంది మ్యూజిషియన్స్‌‌, 365రోజులపాటు కష్టపడితే తరాలపాటు గుర్తిండిపోయేలా ఆ పాటను రూపొందించాం. ఒక దర్శకుడు, కంపోజర్‌, పాట రచయిత, నటీనటులు, నృత్య దర్శకులు అందరం కలిస్తే ఆ పాట.’ అని రెహమాన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఒరిజినల్‌ ‘మసక్కలి’ పాటను విని ఎంజాయ్‌ చేయండి అని పేర్కొంటూ.. సదరు పాటకు సంబంధించిన లింక్‌ను కూడా ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ షేర్‌ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు మద్దతు పలికారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని