close
  • రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో వారాంతంలో కర్ఫ్యూ విధించారు. దీంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. శుక్రవారం రాత్రి నుంచి ఇదే ఒరవడి కనిపించింది.
  • చూస్తుంటే చీరల అలంకరణకు వాడే తళుకుల్ని తీసుకొచ్చి చెట్ల ఆకులకు అంటించినట్లుగా ఉంది కదూ! కానీ, ఇదంతా మంచు బిందువులు చేసిన మాయాజాలం. వాటిపై సూర్యకాంతి పడగానే మరింతగా మెరుస్తూ కనువిందు చేస్తున్నాయి. ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని చెట్లపై కనిపించాయి ఈ దృశ్యాలు.
  • తిరుమల పార్వేట మండపంలో కార్తిక వనభోజన మహోత్సవం వైభవంగా సాగింది. శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపు చేశారు. శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
  • ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగుట్టలోని ఓ టిఫిన్‌ సెంటర్లో దోసెలు వేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని శీలం కవితా ప్రభాకర్‌
  • తుంగభద్ర పుష్కరాలలో నదీస్నానం చేసేందుకు అనుమతి లేకపోవడంతో భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అత్యుత్సాహంతో ఇలా తుంగభద్ర నదిపైనున్న రైల్వేట్రాక్‌పై ఎక్కి అటువైపు గొందిపర్ల గ్రామం వద్ద నదీ స్నానం చేసేందుకు వెళ్తున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా ప్రమాదమే!
  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహోల్‌ జిల్లాలో గడ్డ కట్టిన జలపాతం ఇది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇలాంటి మనోహర దృశ్యాలెన్నో సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
  • నాగార్జునసాగర్‌-శ్రీశైలం మధ్య శనివారం లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ వద్ద ప్రారంభమైన లాంచీ.. 16 మంది పర్యాటకులతో శ్రీశైలానికి వెళ్లింది. పర్యాటకులు ఆహ్లాదకర వాతావరణం మధ్య విహరించి ఆనందానుభూతి పొందారు.

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.