close

ఆటోమొబైల్‌

టీవీఎస్‌ చేతికి నార్టన్‌ మోటార్స్‌

న్యూదిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌.. బ్రిటన్‌లో పసిద్ధి చెందిన స్పోర్టింగ్‌ మోటార్‌సైకిళ్ల కంపెనీ నార్టన్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.153 కోట్లు అని టీవీఎస్‌ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటన్‌లోని నార్టన్‌కు చెందిన ఆస్తుల్ని, బ్రాండ్లను అక్కడి టీవీఎస్‌ అనుబంధ సంస్థ స్వాధీనం చేసుకోనుంది. నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను 1898లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ కంపెనీ క్లాసిక్‌ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తికి బాగా ప్రసిద్ధి పొందింది. నార్టన్‌కు చెందిన వీ4, డామినేటర్‌, కమాండో 961 కేఫ్‌ రేసర్‌ ఎంకే-2, కమాండో 961 స్పోర్ట్‌ ఎంకే-2లు మోడళ్లు బాగా ప్రసిద్ధిపొందాయి.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.