close

ఆటోమొబైల్‌

బీఎస్‌-6తో యమహా బైకులు

న్యూదిల్లీ: ప్రముఖ ద్విచక్ర తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన రెండు కొత్త బైకులను విడుదల చేసింది. తన విజయవంతమైన ఎఫ్‌జడ్‌ సిరీస్‌లో కొనసాగింపుగా ఎఫ్‌జడ్‌-ఎఫ్‌ఐ, ఎఫ్‌జడ్‌ఎస్‌- ఎఫ్‌ఐ పేరిట వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలను రూ.99,200, రూ.1.02 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)గా పేర్కొంది. త్వరలో బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన మరిన్ని బైకులను తీసుకురానున్నట్లు యమహా ఓ ప్రకటనలో తెలిపింది.

ఎఫ్‌జడ్‌-ఎఫ్‌ఐ, ఎఫ్‌జడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ వాహనాలు రెండూ 150 సీసీతో వస్తున్నాయి. ఇందులో ఎఫ్‌జడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ బైక్‌ అదనంగా డార్క్‌నైట్‌, మెటాలిక్‌ రెడ్‌ రంగుల్లో వస్తోంది. రెండిట్లోనూ ముందువైపు సింగిల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ ఉంటుంది. ముందూ వెనుక డిస్క్‌బ్రేక్‌ అమర్చారు. ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యమహా షోరూముల్లో వీటి విక్రయాలు చేపట్టనున్నట్లు యమహా మోటార్‌ ఇండియా ఛైర్మన్‌  మోటోఫుమి షితారా తెలిపారు.


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.