close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఏడాది ఆఖరులో కొవిడ్‌ వ్యాక్సిన్‌

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ ఆదర్‌ పూనావాలా

దిల్లీ: ఈ ఏడాది ఆఖరులోపు భారత్‌కు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ లభిస్తుందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ ఆదర్‌ పూనావాలా చెప్పారు. గావి, గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి భారత్‌తో పాటు తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ 10 కోట్ల డోసులు అభివృద్ధి, తయారు చేస్తున్నట్లు పూనావాలా గతవారం ప్రకటించిన సంగతి విదితమే. ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో క్లినికల్‌ పరీక్షలు 2 వారాల్లో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు చివరి కల్లా వ్యాక్సిన్‌ తయారీకి శ్రీకారం చుడతామని పర్కొన్నారు. ‘మాకు కూడా ఆర్థిక సాయం అందుతున్నందున వ్యాక్సిన్‌ను 3 డాలర్ల (సుమారు రూ.225)కు విక్రయించాలనుకుంటున్నాం. లైసెన్సులు వచ్చాక, ధరను రెండు నెలల్లో ఖరారు చేస్తాం’ అని పూనావాలా తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.