close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ బంగారంపై అధిక రుణం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ సంక్షోభంతో ప్రజల చేతిలో నగదు కొరత ఏర్పడింది. ఆదాయాలు తగ్గడంతో రుణాలు తీసుకుందామనుకున్నా.. ఏ ఆర్థిక సంస్థా ముందుకు రావడం లేదు. అత్యవసరాల్లో డబ్బు అవసరమైన వారికి ఇప్పుడున్న ఏకైక మార్గం.. బంగారాన్ని తాకట్టు పెట్టడమే. ఇప్పటి వరకు బ్యాంకులు బంగారం విలువలో 75 శాతం వరకే రుణాలనిచ్చేవి. ఈ విలువను సాధారణంగా నెలకోసారి లేదా నెలకు రెండుమూడుసార్లు బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఆర్‌బీఐ బంగారంపై లోన్‌-టు-వ్యాల్యూ (ఎల్‌టీవీ)ని 90శాతానికి పెంచింది. మార్చి 31, 2021 వరకూ ఇచ్చే వ్యవసాయేతర రుణాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అంటే.. రూ.లక్ష విలువైన బంగారంపై ఇప్పటి వరకూ రూ.75వేల రుణం లభించేది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో రూ.90వేల వరకూ అప్పు తీసుకోవచ్ఛు ఇది పెద్ద ఊరటగానే చెప్పొచ్ఛు

వ్యాపారులకు ఎంతో ఊరట

వ్యాపారాలు నిర్వహించే వారిని మూలధన కొరత వేధిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు- సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకునే వారికి తక్షణ నగదు లభ్యత ఎంతో అవసరం. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలపై పరిమితి పెంచడం వీరికి కలిసొచ్చే అంశం. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటిపై వడ్డీ రేటూ తక్కువే. ఆర్‌బీఐ తాజా నిర్ణయం వ్యాపారులు- చిన్న రుణ గ్రహీతలకు, క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నవారికీ, ఆదాయంలో కొంత అనిశ్చితి ఉన్నవారికీ సానుకూల పరిణామంగానే చెప్పుకోవచ్ఛు

కొత్త రుణాలకు మాత్రమే..

బ్యాంకులు బంగారం విలువలో 90శాతం మేర రుణం ఇస్తాయా అనేదే పరిశీలించాల్సిన అంశం. ఇది కూడా కొత్తగా తీసుకునే రుణాలకే వర్తిస్తుంది. ఇప్పటికే బంగారం తాకట్టుపై రుణాలు తీసుకున్న వారు.. ఎక్కువ మొత్తం రావాలనుకుంటే పాత రుణాలను చెల్లించి, కొత్తగా రుణం తీసుకోవాల్సిందే. ఇవి కాల వ్యవధితో సంబంధం లేని రుణాలు. కాబట్టి, ముందస్తు చెల్లింపుల్లాంటి రుసుములేవీ ఉండవు. పాత రుణం చెల్లించకుండానే.. కొన్ని బ్యాంకులు అదే అప్పుపై టాపప్‌ రుణం ఇచ్చే అవకాశమూ ఉంది.


ఎన్‌పీఏలు పెరుగుతాయా

తాజా నిర్ణయం వల్ల బ్యాంకులు, పసిడి రుణాలను ఇచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కొంత రిస్కు ఉందని బ్యాంకింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పసిడి ధర గరిష్ఠ స్థాయుల్లో ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి విలువ తగ్గితే, పసిడిపై రుణాలు తీసుకున్న వారు.. ఆ అప్పును చెల్లిస్తారా? అనేది సందేహమేననేది ఒక వాదన. రుణం చెల్లించకపోతే.. బ్యాంకులు ఆ బంగారాన్ని అమ్మేసుకోవచ్ఛు కానీ, ముందుగా ఆ రుణాన్ని ఎన్‌పీఏలుగా ప్రకటించాల్సి వస్తుంది. ఒకవేళ బాకీ తీర్చకపోయినా.. బంగారాన్ని తేలిగ్గానే అమ్ముకునే వెసులుబాటు బ్యాంకులకు ఉంటుంది. మిగతా బాకీని చట్టప్రకారం రుణ గ్రహీత నుంచి వసూలు చేసుకోవచ్ఛు కాకపోతే.. ఇదంతా బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు కొద్దిగా చికాకు వ్యవహారమేనని ఒక బ్యాంకింగ్‌ నిపుణుడు అభిప్రాయపడ్డారు.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.