close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెక్కు మోసాలకు చెక్‌!

ముంబయి: చెక్కు లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు కొత్తగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ‘పాజిటివ్‌ పే’ అనే పద్ధతిని తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ వ్యవస్థ కింద లబ్దిదారుకు చెక్కును ఇచ్చే ముందు సదరు వినియోగదారు ఆ చెక్కును మొబైల్‌తో ఫోటో తీసి, బ్యాంకు మొబైల్‌ అప్లికేషన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ పద్ధతిని రూ.50,000 పైన ఉండే అన్ని చెక్కులకు వర్తింపజేయనున్నారు. పరిమాణం పరంగా 20%; విలువ పరంగా 80 శాతం వరకు ఈ పరిధిలోకి రానున్నాయి. చెక్కు పరిమాణంతో సంబంధం లేకుండా 2016 నుంచీ ఐసీఐసీఐ బ్యాంకు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ వ్యవస్థలో వినియోగదారు ఇచ్చిన చెక్కును లబ్దిదారు తన ఖాతాలోకి డిపాజిట్‌ చేయడానికి ముందే బ్యాంకుకు ఆ చెక్కు విషయం తెలుస్తుంది. నిధులను బదిలీ చేయడానికి ముందే ఆ వివరాలను ముందస్తుగా తనిఖీ చేయడానికి ఈ పద్ధతిలో వీలవుతుందని బ్యాంకింగ్‌ నిపుణులు అంటున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.