close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పసిడి స్థిరీకరణ!

బంగారం

పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.54,271 ఎగువకు వెళ్తేనే రాణించేందుకు అవకాశం ఉంటుంది. లేకుంటే కొంత స్థిరీకరణకు లోనుకావచ్చు. ఒకవేళ ఇదే జరిగితే కాంట్రాక్టు రూ.52,078; ఆ తర్వాత రూ.51,277 దిగువకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు స్వల్పకాలానికి లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడం మంచిది. దీర్ఘకాలానికైతే కాంట్రాక్టు ధర తగ్గినప్పుడల్లా మరిన్ని లాంగ్‌ పొజిషన్లు జత చేసుకోవడం మంచి వ్యూహం అవుతుంది.


వెండి

వెండి సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం ఒడుదొడుకుల మధ్య కదలాడొచ్చు. రూ.63,285 కంటే దిగువకు రాకుంటే సానుకూలంగా చలించేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరింతగా పెరిగేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అందువల్ల లాభాలు స్వీకరించడం ఉత్తమం.


ప్రాథమిక లోహాలు

* రాగి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.513 ఎగవకు వెళ్లకుంటే.. ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.
* సీసం ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.147 దిగువకు రాకుంటే, కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. రూ.149.95 స్థాయిని అధిగమిస్తే రూ.151.65 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
* జింక్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.188 వరకు రాణించే అవకాశం ఉంది. ఈ స్థాయినీ మించితే మరింత పైకి వెళుతుందని భావించవచ్చు. లేకుంటే కొంత దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.
* అల్యూమినియం ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.142.15 స్థాయికి దరిదాపులో కొంత నిరోధం ఎదురుకావచ్చు. అందువల్ల ధర పెరిగినప్పుడల్లా అమ్మే వ్యూహాన్ని అనుసరించడం మంచిది.
* నికెల్‌ ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.1,073 ఎగువన ట్రేడ్‌ కాకుంటే.. రూ.1022; రూ.1001 వరకు పడిపోయే అవకాశం ఉంది.


ఇంధన రంగం

* ముడి చమురు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.3,185 పైన నిలదొక్కుకోకుంటే.. అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల లాంగ్‌ పొజిషన్లున్న వాళ్లు రూ.3,176 సమీపంలో లాభాలు స్వీకరించడం ఉత్తమం.
* సహజవాయువు ఆగస్టు కాంట్రాక్టును రూ.144.65 లక్ష్యంతో రూ.127.65- రూ.131.55 మధ్య కొనుగోలు చేయొచ్చు. అయితే రూ.123.35 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.719 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. ఒకవేళ రూ.709 దిగువకు వస్తే రూ.700.35; రూ.691.45 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.5,861 కంటే ఎగువన కదలాడకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. కొత్తగా లాంగ్‌ పొజిషన్లకు కూడా దూరంగా ఉండటం మంచిది.
* జీలకర్ర ఆగస్టు కాంట్రాక్టు ఈవారం మరింతగా దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లడం ఉత్తమం.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.