close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బంగారం తాకట్టుపై పంట రుణాలకు 7 శాతం వడ్డీ: ఇండియన్‌ బ్యాంకు

చెన్నై (వడపళని), న్యూస్‌టుడే: కొవిడ్‌ - 19 సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులకు బంగారు ఆభరణాల తనఖాపై తక్కువ వడ్డీరేటుకు సులువుగా రుణాలు ఇవ్వాలని ఇండియన్‌ బ్యాంకు నిర్ణయించింది. 7 శాతం వార్షిక వడ్డీరేటుపై ఈ రుణాలు జులై 22 నుంచి మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బంగారం విలువలో 80 శాతం మేర రుణం అందిస్తున్నట్లు వెల్లడించింది. పంట సాగు, పశు సంవర్థక, మత్స్య సంపద, ఇతర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం కూడా ఈ రుణాలు పొందవచ్చని తెలిపింది.బంపర్‌ అగ్రి జువెల్‌ రుణ పథకం కింద ఆభరణాల విలువలో 85 శాతాన్ని రుణంగా అందిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. 6 నెలల్లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇతరులకూ తక్కువ పత్రాలతో రుణాలు వేగంగా ఇస్తున్నట్లు వివరించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.