close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
50 లక్షల వాహనాల ఉత్పత్తి

సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా

దిల్లీ: దేశీయంగా 50 లక్షల వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరినట్లు సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎంఐపీఎల్‌) ప్రకటించింది. గురుగ్రామ్‌లోని ఖేర్కి ధౌలా ప్లాంటులో 50 లక్షలవ వాహనాన్ని ఇటీవల విడుదల చేశామన్నారు. బీఎస్‌ 6 ప్రమాణాలతో, సుజుకీ గిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250 మైక్‌ ఈ ఘనత పొందినట్లు వివరించింది. ఈ ఏడాదే సుజుకీ మోటార్‌ కార్పొరేష:న్‌ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే భారత్‌లో 50 లక్షల ద్విచక్ర వాహనాలు తయారు చేసిన ఘనతను పొందినట్లు ఎస్‌ఎంఐపీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొచిరో హరాఓ పేర్కొన్నారు. 2018-19తో పోలిస్తే 2019-20లో అమ్మకాల్లో 5.7 శాతం వృద్ధి లభించిందన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.