close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫలితాలే నిర్దేశిస్తాయ్‌

అంతర్జాతీయ సంకేతాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకం
షేరు ఆధారిత కదలికలకు అవకాశం
విశ్లేషకుల అంచనా

కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, బంధన్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ వారం ఫలితాలు ప్రకటించనున్నాయి. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించి కంపెనీలు చేసే వ్యాఖ్యలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. కొవిడ్‌-19 మహమ్మారి పలు రంగాలపై చూపిన ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఫలితాలతో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంతర్జాతీయ సంకేతాలు కూడా కీలకం కానున్నాయి. ‘ఈ వారం మదుపర్లు ద్రవ్యోల్బణ గణాంకాలకు ముందు స్పందించనున్నారు. అనంతరం త్రైమాసిక ఫలితాలపై దృష్టి పెట్టొచ్చు. కొవిడ్‌-19కు సంబంధించిన వార్తలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ఉపాధ్యక్షుడు (రీసెర్చ్‌) అజిత్‌ మిశ్రా అన్నారు. నేడు రిటైల్‌ ద్రవ్యోల్బణం, రేపు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ‘జూన్‌ త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. లాక్‌డౌన్‌తో కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇవి ప్రతిబింబించే అవకాశం ఉంది. కంపెనీల వ్యాఖ్యలతో స్వల్పకాలంలో మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు’ మోతీలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌ హెడ్‌ (రిటైల్‌ రీసెర్చ్‌) సిద్దార్థ ఖేమ్కా అన్నారు.  ‘ఇటీవల మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. షేరు ఆధారిత కదలికలతో పాటు మదుపర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది’ జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. 


ఈ వారం బోర్డు సమావేశాలు

నేడు: 5 పైసా క్యాపిటల్‌, ఎంబీఎల్‌ ఇన్‌ఫ్రా
రేపు (14న): విప్రో, రిలయన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రా, సెంచురీ టెక్స్‌టైల్స్‌, డెల్టా కార్ప్‌, గుజరాత్‌ హోటల్స్‌, హిందుస్థాన్‌ కాపర్‌, ఖాదిమ్‌ ఇండియా, మైండ్‌ ట్రీ
15: ఇన్ఫోసిస్‌, బంధన్‌ బ్యాంక్‌, బార్‌ట్రోనిక్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, జీటీపీఎల్‌ హాత్‌వే, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మిండా కార్పొరేషన్‌, రోల్టా ఇండియా, ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌
16: సైయంట్‌, బిర్లా మనీ, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌
17: హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, జీఎన్‌ఏ యాక్సెల్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, హాత్‌వే కేబుల్‌, జయశ్రీ టీ, పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌
18: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం ఫైనాన్షియల్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.