close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెండి పరుగులు!

కమొడిటీస్‌ ఈ వారం


బంగారం

సిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు. ఇప్పటికే మోతాదుకు మించి కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ.. సానుకూలంగానే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుండటమే ఇందుకు కారణం. రూ.49,557 దరిదాపుల్లో కాంట్రాక్టు స్థిరీకరించుకోవచ్చు. ఈ స్థాయి దిగువకు వస్తే బలహీనపడొచ్చు. ట్రేడర్లు విక్రయించి, కొనుగోలు చేయడం మంచిది.


వెండి

వెండి సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.49,442 కంటే కిందకు రాకుంటే.. లాభాలు కొనసాగవచ్చు. ఒకవేళ దిగువకు వస్తే వస్తే రూ.47,563; రూ.46,558 వరకు పడిపోవచ్చు. ఇదే సమయంలో రూ.49,442 కంటే పైన కదలాడితే రూ.52,721; రూ.54,072 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ట్రేడర్లు కొనుగోలు చేసి విక్రయించడం మంచి వ్యూహమవుతుంది.


ప్రాథమిక లోహాలు

* రాగి జులై కాంట్రాక్టు ఈవారం రూ.506 ఎగువకు వెళ్లొచ్చు. ఈ స్థాయిని నిలబెట్టుకుంటే మరింత ముందుకెళ్లొచ్చు లేదా కొంత దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ వారం కాంట్రాక్టు రూ.447.95- 518.35 మధ్య కదలాడొచ్చు.  
* సీసం జులై కాంట్రాక్టు ఈవారం రూ.148.15 కంటే పైకి వెళ్లకుంటే రూ.141.95కు దిగివచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రూ.148.15ను మించితే రూ.149.95 వరకు రాణించే అవకాశం ఉంటుంది.
* జింక్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.178.55 వరకు వెళ్లొచ్చు. ఇక్కడ నిరోధం ఎదురుకావొచ్చు. ఒకవేళ రూ.167 దిగువకు వస్తే రూ.162.35 వరకు పడిపోవచ్చు.
* అల్యూమినియం జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.142.85 వద్ద కొంత నిరోధం ఎదురుకావచ్చు. అందువల్ల ధర పెరిగినప్పుడల్లా అమ్మే వ్యూహంతో ముందుకు వెళ్లడం మంచిది.
* నికెల్‌ జులై కాంట్రాక్టు ఈవారం రూ.988.25 కంటే దిగువన చలించకుంటే రూ.1055; రూ.1070 వరకు పెరిగే అవకాశం ఉంది.


ఇంధన రంగం

* ముడి చమురు జులై కాంట్రాక్టు ఈవారం రూ.3,124 కంటే పైన నిలదొక్కుకోకుంటే అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రూ.3106 దరిదాపుల్లో లాభాలు స్వీకరించడం మంచిది. స్టాప్‌లాస్‌ను రూ.2808కు సవరించుకోవాలి.
* సహజ వాయువు జులై కాంట్రాక్టు ఈవారం రూ.130.20 దిగువకు వస్తే రూ.124.15 స్థాయికి పడిపోవచ్చు. అయితే కాంట్రాక్టు సాంకేతికంగా బలంగా కనిపిస్తోంది. రూ.132.-137.15 మధ్య కొనుగోలు చేయొచ్చు. రూ.130.35ను స్టాప్‌లాస్‌గా తప్పక పెట్టుకోవాలి.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) జులై కాంట్రాక్టు ఈవారం రూ.661 దిగువకు చేరకుంటే కొనుగోలు చేయొచ్చు. రూ.668.35 స్థాయి దిగువకు చేరితే రూ.661.85, రూ.653.85 వరకు దిద్దుబాటు అయ్యేందుకు ఆస్కారం ఉంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు జులై కాంట్రాక్టు రూ.5,499 దిగువకు రాకపోతే కొనుగోళ్లకు అవకాశం ఉంది. రూ.5,693 లక్ష్యంతో రూ.5501- 5551 మధ్య కొనుగోలు చేయొచ్చు. అయితే రూ.5,454 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
* జీలకర్ర జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.13,963- 14,027 లక్ష్యంతో రూ.13,736- 13,815 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవాలి. అయితే రూ.13,621 వద్ద స్టాప్‌లాస్‌ పరిగణించాలి.
* సోయాబీన్‌ జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.3,792 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.3,706 లక్ష్యంతో రూ.3,759- రూ.3,775 మధ్య షార్ట్‌సెల్‌ చేయొచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.