close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు రూ.30,000 కోట్ల ప్రత్యేక పథకం

దిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), గృహ రుణ సంస్థల (హెచ్‌ఎఫ్‌సీలు) కోసం రూ.30,000 కోట్లతో ప్రత్యేక నిధి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కేపిటల్‌ మార్కెట్స్‌ ఏర్పాటు చేసిన ఎస్‌ఎల్‌ఎస్‌ ట్రస్ట్‌ (స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌) ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు స్వల్పకాలిక నిధులు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక నిధి పథకానికి అర్హత పొందేందుకు అవసరమైన నిబంధనలను రూపొందించినట్లు బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ‘అర్హత పొందిన ఎన్‌బీఎఫ్‌సీలు/ హెచ్‌ఎఫ్‌సీల నుంచి స్వల్పకాలిక బాండ్లను ఎస్‌పీవీ కొనుగోలు చేస్తాయి. తద్వారా అందించే నిధులను ప్రస్తుతమున్న బకాయిల చెల్లింపునకు వినియోగించాల్సి ఉంటుంద’ని పేర్కొంది. ప్రభుత్వ హామీతో కూడిన ప్రత్యేక సెక్యూరిటీస్‌లను ఎస్‌ఎల్‌ఎస్‌ ట్రస్ట్‌ జారీ చేస్తుంది. ఈ సెక్యూరిటీస్‌లను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం ద్వారా ప్రత్యేక నిధి పథకం కింద ఆర్‌బీఐ నిధులు అందజేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా జారీ చేసే సెక్యూరిటీస్‌ల విలువ  రూ.30,000 కోట్లకు మించకూడదని పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.