close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మార్కెట్‌ కబుర్లు

* సంక్షోభంలో కూరుకుపోయిన సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌ దక్కించుకోవడంపై మురుగప్పా గ్రూప్‌ ఆసక్తి చూపుతోంది. కంపెనీలో దాదాపు రూ.750 కోట్ల ఈక్విటీపై పెట్టుబడులు పెట్టేందుకు నాన్‌-బైండింగ్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో సీజీ వపర్‌లో 60-75 శాతం వాటా దక్కుతుంది.
* తాజాగా నిర్వహించిన చమురు, గ్యాస్‌ బ్లాకుల వేలంలో 11 ప్రాంతాలకు 12 బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులో 10 సింగిల్‌ బిడ్లు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలకు చెందినవేనని నియంత్రణ సంస్థ డీజీహెచ్‌ తెలిపింది.
* అమెరికాకు చెందిన లుమ్మస్‌ టెక్నాలజీలో మెజారిటీ వాటాను ఛటర్జీ గ్రూప్‌ సంస్థ హల్దియా పెట్రోకెమికల్స్‌ కొనుగోలు చేసింది. మెక్‌డెర్మాట్‌ ఇంటర్నేషనల్‌ నుంచి అంతర్జాతీయ భాగస్వామి రోన్‌ క్యాపిటల్‌తో కలిసి 2.725 బి.డాలర్లు (దాదాపు రూ.20,590 కోట్లు)కు దక్కించుకుంది.
* పలు రకాల ఇన్ఫెక్షన్ల చికిత్సలో వినియోగించే డాక్సీసైక్లిన్‌ హైక్లేట్‌ జనరిక్‌ మాత్రలకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి తెలిపిందని అలెంబిక్‌ ఫార్మా వెల్లడించింది.
* సంయుక్త సంస్థ విద్యుత్‌ వ్యాపారాన్ని ఏబీబీ పవర్‌గ్రిడ్‌లో విలీనం చేయడానికి హితాచీ పూర్తిచేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.