
ఈనాడు, హైదరాబాద్: ఆన్లైన్లో బీ2బీ పద్ధతిలో వైద్య ఉపకరణాలు విక్రయించే సంస్థ అయిన మెడికాబజార్ సిరీస్-బి నిధుల సేకరణలో భాగంగా రూ.112 కోట్ల పెట్టుబడి సమీకరించింది. హెల్త్ క్వాడ్, అకెర్మ్యాన్స్ అండ్ వ్యాన్ హారెన్, రెబ్రైట్ పార్టనర్స్ అండ్ టొప్పన్ ప్రింటింగ్ కో లిమిటెడ్ సంస్థలు ఈ నిధులు సమకూర్చాయి. ఇంతకు ముందు ఒక దఫా ఈ సంస్థలు నిధులు ఇచ్చిన సీబీసీ కంపెనీ, ఎలాన్ కార్పొరేషన్, మిట్సుయ్ సుమిటోమో ఇన్సూరెన్స్ వెంచర్ కేపిటల్ తదితర సంస్థలు, ఇద్దరు ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు మరోసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టారు. తన విస్తరణ కార్యకలాపాలకు అనుగుణంగా మూలధనాన్ని సేకరించినట్లు మెడికాబజార్ పేర్కొంది. వైద్య పరికరాల మార్కెట్లో 2025 నాటికి 10 శాతం వాటా కలిగి ఉండాలనేది తమ లక్ష్యమని మెడికాబజార్ సీఈఓ వివేక్ తివారీ వివరించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!