close
60,000 మించిన వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

దిల్లీ: మార్గదర్శకాలు విడుదల చేసిన 4 రోజుల వ్యవధిలోనే, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల్లో 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ శుక్రవారం తెలిపారు. ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులే 57,000 మందికి పైగా ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం ఉదయానికి 40,000 మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలుపగా, సాయంత్రానికి ఈ సంఖ్య మరింత భారీగా పెరగడం గమనార్హం. మొత్తం 94,000 మందికి వీఆర్‌ఎస్‌ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సిబ్బంది నుంచి స్పందన అనూహ్యంగా ఉందని ప్రకాశ్‌ పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో లక్షన్నర మంది సిబ్బంది ఉండగా, వీరిలో లక్ష మంది వరకు వీఆర్‌ఎస్‌కు అర్హులని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 3 వరకు గడువున్నా, ఉద్యోగులు శరవేగంగా స్పందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ పథకం: 2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, అంతకుమించి వయస్సున్న వారు వీఆర్‌ఎస్‌కు అర్హులు. పనిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజులు, ఇంకా ఉన్న పదవీ కాలానికి గాను ఏడాదికి 25 చొప్పున వేతనాన్ని ఎక్స్‌గ్రేషియా (పరిహారం)గా ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.