close
ఆ దేవుణ్నే అడగండి

నీలేకని వ్యాఖ్యలపై సెబీ ఛైర్మన్‌

దిల్లీ: ఇన్ఫోసిస్‌ ఆదాయాలు, మార్జిన్లను పెంచి చూపించారంటూ ‘ప్రజావేగులు’ లేదా ‘నైతిక ఉద్యోగులు’ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ వెల్లడించారు. అందువల్ల ప్రస్తుతం ఆ ఆరోపణలపై తాను మాట్లాడానికి ఏమీ లేదని తెలిపారు. అయితే కంపెనీ గణాంకాలను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదంటూ ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని చేసిన వ్యాఖ్యలపై ఆయనను అభిప్రాయం కోరగా.. ఈ విషయంపై ఆ దేవుణ్ని లేదంటే ఆయననే అడగమని త్యాగీ అన్నారు. ‘మదుపర్లు సొంతంగానే ఓ నిర్ణయానికి రావాలి. మేం ఏం చేయాల్సి ఉంటుందో ఆ పని చేస్తున్నాం. ఏమి తేలుతుందో ఆ విషయం మీకు తెలుస్తుంద’ని ఆయన తెలిపారు. అమెరికాలో కూడా ఇన్ఫోసిస్‌ నమోదైనందున అక్కడి నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీతో ఏమైనా సమాచారం పంచుకున్నారా అని త్యాగీని అడగగా.. ఇది రెండు నియంత్రణ సంస్థల మధ్య విషయమని, గోప్యత పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ సీఐఐ నిర్వహించిన సమావేశంలో త్యాగి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ నమోదిత సంస్థలు 91 ఉండగా.. 45 సంస్థలు 25 శాతం కనీస ప్రజల వాటా పరిమితిని కలిగిలేవని పేర్కొన్నారు. అవి కూడా నిబంధనకు తగ్గట్లుగా వాటా పరిమితిని కలిగి ఉండేంద]ుకు మార్కెట్లో ఇష్యూల రాక ప్రవాహాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకుగాను ఆ కంపెనీలే ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. మరోవైపు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొంది కూడా చాలా కంపెనీలు లిస్టింగ్‌కు దూరంగానే ఉంటున్నాయని త్యాగీ అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.