close
పసిడి జిగేల్‌!

బంగారం

పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం మరింత రాణించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. సాంకేతికంగానూ పసిడి కాంట్రాక్టు సానుకూలంగా కనిపిస్తోంది. రూ.37,602 స్థాయి కంటే కిందకు రాకుంటే.. జోరు కొనసాగి రూ.38,257; రూ.38,749 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.37,602 దిగువకు వెళ్తే రూ.37,326; రూ.37,111 వరకు పడిపోవచ్చు. గురువారం జరిగే ఐరోపా సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశాన్ని ట్రేడర్లు గమనించే అవకాశం ఉంది. ఇతర అంతర్జాతీయ పరిణామాలూ దిశానిర్దేశం చేస్తాయి.

వెండి

వెండి డిసెంబరు కాంట్రాక్టు గతవారం కనిష్ఠ స్థాయైన రూ.46,700 దిగువకు రాకుంటే, ఈవారం సానుకూలంగా చలిస్తుందని భావించవచ్చు. రూ.45,736; రూ.46,396 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. రూ.44,416 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకుని ప్రస్తుత లాంగ్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు. అలాగే ఈవారం కాంట్రాక్టు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

ప్రాథమిక లోహాలు

* రాగి అక్టోబరు కాంట్రాక్టుకు ఈవారం రూ.440.60 వద్ద కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయికి దరిదాపులో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.
* సీసం అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.157.85 వరకు పెరగొచ్చు. అయితే ఇక్కడ నిరోధం ఎదురయ్యే అవకాశం ఉన్నందున లాభాలు స్వీకరించాలి.
* జింక్‌ అక్టోబరు కాంట్రాక్టు ఈవారం ఒడుదొడుకుల మధ్య  ప్రతికూల ధోరణితో చలించొచ్చు.
* అల్యూమినియం అక్టోబరు కాంట్రాక్టు రూ.134.25 ఎగువన ముగిస్తే రూ.135.65; రూ.137.65 వరకు పెరుగుతుంది. ఒకవేళ రూ.134.25 స్థాయిని నిలబెట్టుకోకపోతే రూ.132.25-131.35 వరకు పడిపోవచ్చు.
* నికెల్‌ అక్టోబరు కాంట్రాక్టుకు ఈవారం రూ.1,227 ఎగువన స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.1,143 లక్ష్యంతో షార్ట్‌సెల్‌ చేయొచ్చు.

ఇంధన రంగం

* ముడి చమురు నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.3,885 ఎగువన నిలదొక్కుకుంటే.. రూ.3,933; రూ.4,001 వరకు రాణించవచ్చు. ఒకవేళ రూ.3,885 స్థాయిని నిలబెట్టుకోకపోతే మాత్రం రూ.3,761; రూ.3,697 స్థాయిలకు దిగివస్తుంది.
* సహజవాయువు నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.176.40 కంటే ఎగువన నిలదొక్కుకుంటే రూ.183.85; రూ.187.95 వరకు చేరొచ్చు.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.565.45 వరకు పెరుగుతుందని భావించవచ్చు. అయితే రూ.556.35 కంటే కిందకు వస్తే కాంట్రాక్టు డీలాపడేందుకు అవకాశం లేకపోలేదు.

వ్యవసాయ ఉత్పత్తులు

* గత పదివారాలుగా పసుపు కాంట్రాక్టు ప్రతికూలంగానే చలిస్తూ వస్తోంది. ఈవారం రూ.5,368 దిగువకు రాకుంటే కాంట్రాక్టు తిరిగి పుంజుకోవచ్చు.
* జీలకర్ర నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.16,116 కంటే దిగువకు వస్తే కొంత అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు.
* పత్తి నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,053 దిగువన ట్రేడ్‌ కాకుంటే సానుకూలంగా చలిస్తుందని అనుకోవచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.