close
వచ్చే ఏడాదిలో కొత్త క్షేత్రాల్లో గ్యాస్‌ ఉత్పత్తి

దిల్లీ: ప్రతిష్ఠాత్మక కేజీ- డీ6 బ్లాకులోని కొత్త గ్యాస్‌ క్షేత్రంలో 2020 మధ్య నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్న లక్ష్యానికి అనుగుణంగా వెళ్తున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. ప్రస్తుత క్షేత్రాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కంపెనీ ఈ వ్యాఖ్యలు చేసింది. కేజీ- డీ6 బ్లాకులో కనుగొన్న మూడు క్షేత్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడానికి రిలయన్స్‌, బ్రిటన్‌ భాగస్వామి బీపీ పీఎల్‌సీలు రూ.40,000 కోట్ల పెట్టుబడులను 2017 జూన్‌లో ప్రకటించాయి. 2020-22 మధ్య ఈ క్షేత్రాల నుంచి రోజుకు మొత్తం 30- 35 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ( 100 కోట్ల ఘనపు అడుగులు) గ్యాస్‌ను వెలికితీయొచ్చని అంచనా. రిలయన్స్‌ కనుగొన్న మూడు క్షేత్రాలు ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్‌ క్లస్టర్‌, ఎంజే ఫీల్డ్‌గా ఉన్నాయి. ఇందులో ఆర్‌-క్లస్టర్‌ నుంచి ముందుగా ఉత్పత్తి ప్రారంభించనున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.