close
పసిడి ధరను చమురు మండిస్తుందా?

బంగారం, వెండి

సిడి అక్టోబరు కాంట్రాక్టు గతవారం రూ.37,774 వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. సౌదీ అరేబియా ప్రధాన చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడి నేపథ్యంలో ఆ తర్వాత కూడా జోరు కొనసాగి రూ.38,215 వద్ద వారం గరిష్ఠ స్థాయిని కాంట్రాక్టు చేరింది.  చివరకు స్వల్పంగా 0.12% నష్టపోయి రూ.37,727 వద్ద కాంట్రాక్టు ముగిసింది. డ్రోన్ల దాడులపై సౌదీ అరేబియా నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఉండనుందో ఈవారం ఓ స్పష్టత రావచ్చు. అందువల్ల ఈవారం పసిడి కాంట్రాక్టుకే కాదు మిగతా కమొడిటీలకు కూడా ఇదే కీలక పరిణామంగా భావించవచ్చు. ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తాయనే సంకేతాలు కనిపిస్తే పసిడి కాంట్రాక్టు సానుకూలమవుతుంది. అయితే సాంకేతికంగా చూస్తే కాంట్రాక్టు మరికొంత దిద్దుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల సాంకేతికత, కీలక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రూ.38,216 వద్ద స్టాప్‌లాస్‌తో ప్రస్తుత షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు. రూ.37,793 దిగువన కొత్తగా మరికొన్ని షార్ట్‌ పొజిషన్లు కూడా తీసుకోవచ్చు. అయితే రూ.37,917 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి. వెండి డిసెంబరు కాంట్రాక్టు కిందటి వారం రూ.46,100 వద్ద ఆరంభమైంది. సమీప మద్దతు స్థాయైన రూ.45,900 స్థాయికి దిగివచ్చాక.. తిరిగి కాంట్రాక్టు పుంజుకుంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తోడవడంతో కాంట్రాక్టు రూ.47,468 వద్ద వారం గరిష్ఠాన్ని తాకింది. ఆఖరుకు 0.92% లాభంతో రూ.46,523 వద్ద స్థిరపడింది. ఈవారం సాంకేతికంగా రూ.46,100 దిగువన కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. ముగింపుపరంగా రూ.45,900 దిగువకు వస్తే మరింత డీలాపడి రూ.44,224 వరకు కాంట్రాక్టు దిగివచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.45,900 దిగువకు రాకుంటే రూ.47,757 ఎగువన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. గత నాలుగు వారాల్లో కదలాడిన తీరును పరిగణనలోకి తీసుకుంటే.. పసిడితో పోలిస్తే వెండి పుంజుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ప్రాథమిక లోహాలు

రాగి సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.448.65 దిగువన చలిస్తే.. పెరిగినప్పుడల్లా అమ్మే వ్యూహాన్ని అనుసరించడం మంచిది. మరోవైపు సమీపకాలంలో రూ.437 దరిదాపులో కాంట్రాక్టుకు మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయి వద్ద కాంట్రాక్టుకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించొచ్చు. మొత్తంగా రూ.437- రూ.454.75 శ్రేణిలో కాంట్రాక్టు కదలాడేందుకు అవకాశం ఉంది. సీసం సెప్టెంబరు కాంట్రాక్టు గత కొన్ని వారాలుగా రూ.148- 159.80 శ్రేణిలో చలిస్తోంది. ఈవారం కూడా ఇదే శ్రేణికి పరిమితమయ్యే అవకాశం ఉంది. జింక్‌ సెప్టెంబరు కాంట్రాక్టును ఈవారం రూ.180.75- 182.75 మధ్య కొనుగోలు చేయొచ్చు. అల్యూమినియం సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.139.35 కంటే పైన చలిస్తే రూ.142.85; రూ.144 వరకు వెళుతుందని భావించవచ్చు. ఒకవేళ రూ.139 ఎగువన నిలదొక్కుకోకుంటే రూ.138; రూ.137.15 వరకు కొనుగోళ్ల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంటుంది. నికెల్‌ సెప్టెంబరు కాంట్రాక్టు ఈ రోజు రూ.1,240 దిగువన చలిస్తే రూ.1,163 వరకు పడిపోవచ్చు. ఒకవేళ ఆ స్థాయి కంటే పైన ట్రేడయితే.. రూ.1,263 ఎగువన కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు.

ఇంధన రంగం

ముడి చమురు అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.4,260 కంటే పైన కదలాడకుంటే.. రూ.3,948 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ స్థాయిలపై ట్రేడర్లు ఓ కన్నేసి ఉంచాలి. ఒకవేళ రూ.4,260 స్థాయిని అధిగమిస్తే షార్ట్‌ సెల్‌ పొజిషన్లు వదిలించుకోవాలి. కొత్తగా లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. సాంకేతికంగా చూస్తే సహజవాయువు సెప్టెంబరు కాంట్రాక్టుకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. అందువల్ల షార్ట్‌ సెల్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవడం మంచిది. అలాగే పెరిగిన ప్రతిసారి మరికొన్ని షార్ట్‌ సెల్‌ పొజిషన్లు జత చేసుకోవడం మంచి వ్యూహమే అవుతుంది. ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) సెప్టెంబరు కాంట్రాక్టు ఈ రోజు రూ.560.50 కంటే పైన చలిస్తే.. మరింత పెరిగి రూ.562.50 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.

వ్యవసాయ ఉత్పత్తులు

సుపు కాంట్రాక్టు వరుసగా ఐదో వారమూ నష్టాల్లో ముగిసింది. రూ.6270 కంటే పైకి వెళ్లకుంటే ఈవారం కూడా మరికొంత దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రూ.6,059 లక్ష్యంతో ప్రస్తుత షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు. ధనియాలు అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.6,028 కంటే దిగువకు రాకుంటే కొనుగోళ్ల మద్దతు లభించొచ్చు. రూ.6,270 లక్ష్యంతో రూ.5,978 దరిదాపులో కాంట్రాక్టుకు లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. మొక్కజొన్న రబీ అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.2,062 కంటే పైన చలించకుంటే కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది.


- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.