close
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గ్రామీణ రుణ మేళాలు

దిల్లీ: తమ రిటైల్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు వీలుగా వచ్చే 6 నెలల్లో 1,000 గ్రామీణ రుణ మేళాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది. దేశంలోని 300 పైచిలుకు జిల్లాల్లో సుమారు 6,000 గ్రామాలకు కలిసొచ్చేలా ఈ రుణ మేళాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామాల ప్రజలు ఈ మేళాకు హాజరై, బ్యాంకు అందించే వివిధ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు. ట్రాక్టర్‌, ఆటో, ద్విచక్ర వాహనం, వ్యవసాయ రుణాలను పొందడంతో పాటు కరెంట్‌, పొదుపు ఖాతాల్ని కూడా ప్రారంభించుకోవచ్చు. స్థానిక ప్రజలకు బ్యాంకు సేవల గురించి వివరించేందుకు కూడా ఈ రుణ మేళాల్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటామని బ్యాంకు వెల్లడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.