Eenadu Online Edition Business News - EENADU
close
గృహరుణ, ఎన్‌బీఎఫ్‌సీ విభాగాలు కలిగిన కంపెనీల విషయంలో బైబ్యాక్‌ నిబంధనల సడలింపు!

దిల్లీ: గృహరుణ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లను అనుబంధ సంస్థలుగా కలిగి ఉన్న నమోదిత కంపెనీలు ప్రస్తుతం షేర్లు బైబ్యాక్‌ చేసేందుకు ఉన్న నిబంధనలు సడలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ భావిస్తోంది. ఈ వారంలో జరిగే సెబీ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారులు తెలిపారు. షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియ సెబీ బైబ్యాక్‌ నిబంధనలతో పాటు కంపెనీల చట్టం నిబంధనలకు అనుగుణంగా జరగాల్సి ఉంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 
* చెల్లించిన మూలధనం, కంపెనీ వద్ద ఉన్న మిగులు నిల్వల్లో 25 శాతానికి మించి బైబ్యాక్‌ ఉండకూడదు. అయితే వాటాదార్ల ప్రత్యేక తీర్మాన ఆమోదం ద్వారా మరో 10% వరకు అదనంగా కొనుగోలు చేయొచ్చు. 
* కంపెనీ సురక్షిత, అరక్షిత రుణాల వాటా, బైబ్యాక్‌ తరవాత చెల్లించిన మూలధనం, మిగులు నిల్వల కంటే రెట్టింపు కాకూడదు. కంపెనీల చట్టంలోని అధిక రుణం, వాటా శాతాలపై ప్రత్యేకంగా నిబంధన ఉంటే మినహా ఇలా చేయకూడదు. 
* బైబ్యాక్‌ పరిమితులు నిర్థారించడానికి కంపెనీల ఏకీకృత, స్టాండలోన్‌ ఖాతాలను సెబీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏకీకృత ఖాతాలను పరిశీలిస్తున్నప్పుడు ఎన్‌బీఎఫ్‌సీ, గృహరుణ సంస్థలను అనుబంధ సంస్థలుగా కలిగి ఉన్న కంపెనీలకు అధిక రుణాలు ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి పరిష్కారంగా, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నిబంధనలు సడలించాలని సెబీ భావిస్తోంది. దీనిప్రకారం ఇలాంటి అనుబంధ సంస్థలను కలిగి ఉన్న ప్రభుత్వ కంపెనీలు, షేర్ల తిరిగి కొనుగోలు తరవాత రుణ, వాటా నిష్పత్తి 6:1 శాతం ఉండేందుకు అనుమతిస్తున్నారు. దీనిపై మే నుంచి సంప్రదింపులను సెబీ నిర్వహిస్తోంది. దీనిలో వచ్చిన సూచనల ప్రకారం.. 
* స్టాండలోన్‌, ఏకీకృత ఖాతాల ప్రకారం.. బైబ్యాక్‌ తరవాత సాధారణ కంపెనీలకు రుణ, వాటా నిష్పత్తి 2:1 శాతం ఉండేలా కొనసాగాలని భావిస్తోంది. కంపెనీల చట్టంలో అధిక నిష్పత్తిని ప్రతిపాదించే కంపెనీలకు మాత్రం మినహాయింపు ఇస్తారు. 
* ఒకవేళ స్టాండలోన్‌ ఖాతాల ప్రకారం రుణ, వాటాల నిష్పత్తి 2:1 శాతాన్ని మించకుండా, ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ శాతం అధికమైనా కూడా, బైబ్యాక్‌లను అనుమతిస్తారు. అయితే ఎన్‌బీఎఫ్‌సీ, గృహరుణ కంపెనీల గణాంకాలను మినహాయించినప్పుడు రుణ, వాటాల నిష్పత్తి 2:1 శాతం వరకు మాత్రమే ఉండాలి. ఈ ఎన్‌బీఎఫ్‌సీ, గృహరుణ కంపెనీలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ నియంత్రణ పరిధిలో ఉండాలి. 
* కానీ స్టాండలోన్‌ ఖాతాల ప్రకారం రుణ, వాటాల నిష్పత్తి, అనుబంధ సంస్థలను మినహాయించినా 5:1 కు మించకూడదు. 
* ఏకీకృత ఖాతాలను పరిగణనలోకి తీసుకునేప్పుడు, రుణ, వాటాల నిష్పత్తిని లెక్కించేప్పుడు ఏఏఏ రేటింగ్‌ కలిగిన నియంత్రణా అనుబంధ సంస్థలను మినహాయించాలని సెబీ ప్రాథమిక మార్కెట్‌ సలహా సంఘం సూచించింది. అయితే ఆచరణలోకి వచ్చేసరికి రేటింగ్‌ తరచు మారుతున్నందున, ఈ ప్రతిపాదనను అమలు చేయడం కష్టమని సెబీ నిర్ణయించింది. స్వల్పకాల, దీర్ఘకాల అంశాల్లో రేటింగ్‌లు మారుతుంటాయి కూడా.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.