Eenadu Online Edition Business News - EENADU
close
సవాళ్లున్నాయ్‌.. 

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ 
అవకాశాలపై దృష్టి సారించాలి 
ఆర్థిక వ్యవస్థ మందగమనం వాస్తవమే 
రెపో రేటుతో రుణ రేట్లు అనుసంధానించాలి 
మరో ఎన్‌బీఎఫ్‌సీని విఫలం కానివ్వం

ముంబయి: ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అంగీకరించారు. ఇంటాబయటా చాలా సవాళ్లున్నాయనీ అన్నారు. అయితే ప్రతి ఒక్కరూ భవిష్యత్‌లో ఎదురయ్యే అవకాశాలపై దృష్టి సారించాలని.. నిరాశవాదాన్ని వీడాలని పిలుపునిచ్చారు. ఇటీవలి బడ్జెట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలపై కార్పొరేట్‌ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. ధనవంతులు, విదేశీ మదుపర్లపై బడ్జెట్లో అధిక పన్నులు విధించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికోత్పత్తి, ఎగుమతులు, వాహన విక్రయాల వంటివి స్థూల ఆర్థిక అంశాలు కూడా నేలచూపులు చూసిన ఈ తరుణంలో దాస్‌ ఈ విధంగా స్పందించడం విశేషం. బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఆర్థిక మందగమనం కారణంగా మార్కెట్లు డీలా పడ్డాయి కూడా. ద్రవ్యోల్బణ గణాంకాలు తప్ప ఇటీవలి కాలంలో ఎటువంటి సానుకూల వార్తా వెలువడలేదు.

ఇతర బ్యాంకులూ ఆ బాట పట్టాలి: ఎస్‌బీఐ సహా 12 బ్యాంకులు తమ రుణాలు, డిపాజిట్‌ రేట్లను రెపో రేటుకు అనుసంధానం చేసినట్లే.. వ్యవస్థలోని ఇతర బ్యాంకులూ స్వచ్ఛందంగా ఆ పనిచేయాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఇలాంటివి పరపతి విధాన ప్రక్రియ బదిలీని వేగవంతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని బ్యాంకుల కంటే ముందుగా ఎస్‌బీఐ తన రుణ, డిపాజిట్‌ రేట్లను మే నుంచే రెపో రేటుకు అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాంకులు ఇపుడే మొండి బకాయిల సంక్షోభం నుంచి బయటకు వస్తున్నాయి. అవి తమ బ్యాలెన్స్‌షీట్లను బలోపేతం చేసుకోవడానికి సమయం ఇవ్వాల’ని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్‌బీఎఫ్‌సీల నాణ్యత సమీక్ష ఇప్పట్లో లేదు : భారీ స్థాయి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ) ఏదీ విఫలం కాకుండా చూసే బాధ్యతకు కట్టుబడి ఉన్నట్లు దాస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుతానికి ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను సమీక్షించే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. అయితే 500కు పైగా ఎన్‌బీఎఫ్‌సీలను సునిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.