
ఈనాడు, హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య తగ్గిందని ఏపీ, తెలంగాణ ప్రాంతీయ ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎన్.శంకరన్ అన్నారు. 2018-19లో ఈ ప్రాంతం నుంచి రూ.58,040 కోట్లు ఆదాయపు పన్నును వసూలు చేశామని తెలిపారు. ఈ ఏడాది రూ.70,574 కోట్లు పన్ను వసూలును లక్ష్యంగా పెట్టుకొన్నట్లు వివరించారు. దీన్ని సాధించగలమని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. పన్ను దాఖలుకు చివరి రోజు ఆగస్టు 31కల్లా రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐలో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలకు పన్ను దాఖలులో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఆదాయపు పన్ను దాఖలు చేసే వారికి సహాయపడేందుకు రెండు మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
- వైద్యానికి డబ్బుల్లేక భార్య సజీవ ఖననం