close
Array ( ) 1

తాజా వార్తలు

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు

1. 58% మాల్‌వేర్‌ డాక్యుమెంట్లు జీమెయిల్‌కే

జీమెయిల్‌లో ఏదైనా మెయిల్‌ ఓపెన్‌ చేసినప్పుడు...  అందులోని అటాచ్‌మెంట్స్‌ను జీమెయిల్‌ స్కాన్‌ చేయడం మీరు చూసే ఉంటారు. ఇది స్కాన్‌ చేశాం.. అంతా బాగుంది మీరు డౌన్‌లోడ్‌ చేయొచ్చు అని... మేం స్కాన్‌ చేయలేదు ఒకసారి పరిశీలించుకోండి అని చూపిస్తూ ఉంటుంది. మీ సిస్టమ్‌/మొబైల్‌ను హ్యాకర్ల దాడి నుంచి రక్షణ కోసం గూగుల్‌ ఈ పని చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా మెషీన్‌ లెర్నింగ్‌తో జరుగుతుంది. తాజాగా గూగుల్‌ ఈ ప్రక్రియలో కొత్త స్కానింగ్‌ ప్రక్రియను జోడించిందట. దీని వల్ల వైరస్‌ డిటక్షన్‌ రేట్‌ 150 శాతం పెరిగిందట. మాల్‌వేర్‌ ఉన్న డాక్యుమెంట్లలో 58 శాతం జీమెయిల్‌కే వస్తున్నాయని ఓ సర్వేలో తేలడం గమనార్హం.

2. రియల్‌మీ 6 ప్రో మూడు రంగుల్లో...

బడ్జెట్‌ మొబైల్స్‌ రేంజ్‌లో త్వరలో రియల్‌మీ నుంచి కొత్త మొబైల్స్‌ రాబోతున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో తీసుకొస్తున్నట్లు రియల్‌మీ ఇటీవల ప్రకటించింది. తాజాగా ఈ మొబైల్‌ లుక్‌ బయటికొచ్చింది. నీలం, నారింజ, గులాబీ రంగుల్లో వైవిధ్యంగా ఈ మొబైల్స్‌ కనిపిస్తున్నాయి. రియల్‌మీ 6 ధర ₹10వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. రియల్‌మీ 6 ప్రో ₹15 వేల లోపు ఉండొచ్చని సమాచారం. ప్రో వెర్షన్‌లో 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మార్చి 5న ఈ మొబైల్‌ను మన దేశంలో లాంచ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రియల్‌మీ వెబ్‌సైట్‌లో బ్లైండ్‌ ఆర్డర్‌ స్వీకరిస్తున్నారు. 

3. హువావే పీ40  లైట్‌ కూడా వస్తోంది

హువావే నుంచి ఫ్లాగ్‌షిప్‌ రేంజిలో మరో ఫోన్‌ రాబోతోంది. హువావే పి40 పేరుతో మార్చి 26న లాంచ్‌ చేయనున్నారు. దీనికి లైట్‌ వెర్షన్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది హువావే నోవా 6ఎస్‌ఈకి రీబ్రాండెడ్‌ వెర్షన్‌ అని తెలుస్తోంది. ఈ మొబైల్‌ గతేడాది డిసెంబరులో చైనాలో లాంచ్‌ చేశారు. ఇందులో కిరిన్‌ 810 ప్రాసెసర్‌ ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ ఇస్తారు. వెనుకవైపు 48 ఎంపీ, 8 ఎంపీ, రెండు 2 ఎంపీ కెమెరాల సెటప్‌ ఉండనుంది. అయితే ఈ మొబైల్‌ తీసుకొస్తారనే విషయంలో స్పష్టత లేదు.

4. మ్యాక్‌ లేకుండా యాపిల్‌ మొబైల్‌ రికవరీ...

మ్యాక్‌ కంప్యూటర్లకు ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌ రికవరీ టూల్‌ను ఇప్పుడు ఐఫోన్స్‌కు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి యాపిల్‌  సన్నాహాలు చేస్తోంది. ఐఓఎస్‌ 13.4 వెర్షన్‌లో ఈ మేరకు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుందట. బూట్‌లోడర్‌లో యాపిల్‌ మొబైల్స్‌ చిక్కుకున్నప్పుడు మొబైల్‌ను కచ్చితంగా మ్యాక్‌ లేదా కంప్యూటర్లకు కనెక్ట్‌ చేసి సిస్టమ్‌లో రికవరీ చేయాల్సి వచ్చేది. త్వరలో ఈ ఇబ్బంది లేకుండా ఐఫోన్‌ నుంచే నేరుగా రికవరీ చేయొచ్చు. త్వరలో ఈ ఫీచర్‌ అందరకీ అందుబాటులోకి తీసుకురానుంది.

5. ఎల్‌జీ వీ60 థింక్యూ 5జీ ఇలా ఉంటుంది...

6. అపోలో హాస్పిటల్స్‌ ప్రత్యేక సదుపాయం

అపోలో ఆస్పత్రిలో డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం త్వరలో చాలా సులభం. వినియోగదారుల సౌలభ్యం కోసం అపోలో అలెక్సా సేవలను వినియోగించుకుంటోంది. వినియోగదారులు అమెజాన్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ల ద్వారా అపోలో వైద్యులకు  సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చట. మీకు కావాల్సిన వైద్యుడు అందుబాటులో ఉన్నారా లేదా అనేది తెలుసుకొని అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆస్పత్రితోపాటు ఫార్మసీలకు కూడా ఈ సేవలను పొందొచ్చు. 

 

7. వాట్సాప్‌ను దాటేసిన టిక్‌టాక్‌

యువత టిక్‌టాక్‌ ఎంతగా ఇష్టపడుతోందో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా టిక్‌టాక్‌ మరో ఘనత సాధించింది. డౌన్‌లోడ్స్‌లో వాట్సాప్‌ను దాటేసింది. జనవరి నెలలో టిక్‌టాక్‌ ఈ రికార్డు సాధించింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ ఆప్‌స్టోర్‌లో జనవరి నెలలోనే 104 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ అయ్యాయట. గతేడాది డిసెంబరులో నమోదైన డౌన్‌లోడ్‌ల కంటే 46 శాతం పెరుగుదల నమోదైందట. భారత్‌, బ్రెజిల్‌, అమెరికాలో ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేశారని తెలుస్తోంది.  మొత్తంగా ఇప్పటివరకు టిక్‌టాక్‌ 1.82 బిలియన్ డౌన్‌లోడ్స్‌ నమోదు చేసింది. 

8. పబ్‌జీలో కొత్త ఫీచర్లు

త్వరలో రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న పబ్‌బీలో కొత్త ఆప్షన్లు యాడ్‌ అవ్వబోతున్నాయి. 0.17.0 వెర్షన్‌లో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇన్నాళ్లూ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో ఉన్న డెత్‌ రీప్లే ఫీచర్‌ను మొబైల్‌కు తీసుకొస్తున్నారు. గేమ్‌లో ప్లేయర్‌ చనిపోయాక... ఏం తప్పు చేశాడనేది ఈ ఫీచర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. సర్వైవల్‌ మోడ్‌లో కొత్తగా ఎక్స్‌ట్రీమ్‌ కోల్డ్‌ మోడ్‌ను తీసుకురాబోతున్నారు. ఈ సమయంలో చలిమంట వేసుకుంటేనే ప్లేయర్‌ ఆటలో కొనసాగుతాడు. దానికి తగ్గట్టుగా ముందుగా అవసరమైనవి లూట్‌ చేయాలి. దీంతోపాటు ఎక్స్‌ట్రీమ్‌ కోల్డ్‌వేవ్‌ అనే ఫీచరూ రాబోతోంది. అతి చలిగాలులు వచ్చినప్పుడు ఏదైనా షెల్టర్‌ వెతుక్కోవాలి. లేదంటే ఆట ముగిసినట్లే. ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. 

 

9. గూగుల్‌.. అడిడాస్‌ కలసి... 

గూగుల్, ఈఏ స్పోర్ట్స్‌, అడిడాస్‌ కలసి ఓ కొత్త ఫ్యాబ్రిక్‌ను తీసుకురాబోతున్నాయి. దీనికి సంబంధించి అడిడాస్‌ ట్విటర్‌లో ఓ జిఫ్‌ పోస్ట్‌ చేసింది. జాక్వార్డ్‌ పేరుతో ఓ టచ్‌ సెన్సిటివ్‌ ఫ్యాబ్రిక్‌ను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ప్లే కనెక్ట్‌డ్‌ ట్యాగ్‌లైన్‌తో ఈ ఫ్యాబ్రిక్‌ను తీసుకురాబోతున్నారు. మార్చి 10న దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. చిప్‌ ఉన్న ఈ ఫ్యాబ్రిక్‌ను మీ మొబైల్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్‌లో పాటలు ప్లే చేయడం, ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టడం లాంటి పనులు చేయొచ్చు. ఇప్పటికే లెవిస్‌ బ్రాండ్‌లో ఈ తరహా చొక్కాలున్నాయి. 

10. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌లో ఒడియా... 

గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌లో కొత్త భాషలు కలసి నాలుగేళ్లు అయ్యిందంటే నమ్ముతారా? కానీ అదే జరిగింది. గూగుల్‌ ఆఖరిగా 2016లో కొత్త భాషల్ని యాడ్‌ చేసింది. మళ్లీ ఇప్పుడు 2020లో మళ్లీ భాషల్ని కలిపింది.  ఈసారి ఒడియా, టాటా, టర్క్‌మెన్‌, కిన్యర్‌వాండా, టటర్‌తోపాటు చైనాకు చెందిన ఉయ్‌గర్‌ భాషల్ని కలిపింది. దీంతో గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌లో ఉన్న భాషల సంఖ్య 108కి చేరింది. కొత్త భాషలు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.