దిల్లీ: అంకుర సంస్థలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ (అంకుర భారత్ మూలనిధి)ను ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. వినూత్న ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తీసుకొచ్చే విషయంలో యువ వ్యాపారవేత్తలకు ఈ నిధి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అంకురాల వృద్ధితో అటు ఉద్యోగాల సృష్టి జరగడమే కాకుండా ఆ ప్రాంతంలోని ప్రజల జీవన ప్రమాణాలూ మెరుగవుతాయని ఆయన అన్నారు. ‘అంకుర సంస్థలకు మూలనిధిని అందించేందుకు దేశం రూ.1000 కోట్ల నిధిని అందుబాటులోకి తెచ్చింది. కొత్త అంకురాల ఏర్పాటుకు, వాటి వృద్ధికి ఈ నిధి తోడ్పడుతుంద’ని స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమిట్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని చెప్పారు. అంకుర సంస్థలు మూలధనాన్ని సమీకరించేందుకు ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్‌ను కూడా ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. మున్ముందు రుణాలను సమీకరించే విషయంలోనూ అంకురాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీనిచ్చారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?