close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీఎన్‌బీని మోసం చేసినసింటెక్స్‌ ఇండస్ట్రీస్‌

దిల్లీ: సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ మోసపూరితంగా రూ.1203.26 కోట్ల రుణాన్ని పొందిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ప్రకటించింది. సెబీ నమోదిత నిబంధనలు, వెల్లడి అంశాలు(ఎల్‌ఓడీఆర్‌); బ్యాంకు విధానాల ప్రకారం..‘సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ నిరర్థక ఆస్తుల్లో రూ.1203.26 కోట్ల మేర మోసంతో తీసుకున్న రుణమ’ని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో బ్యాంక్‌ తెలిపింది. అహ్మదాబాద్‌ జోనల్‌ కార్యాలయంలోని కార్పొరేట్‌ శాఖలో ఈ మోసం జరిగినట్లు వివరించింది. ‘రూ.1203.26 కోట్ల మోసం గురించి ఆర్‌బీఐకి అకౌంట్స్‌ ఆఫ్‌ ద కంపెనీ(ఎస్‌ఐఎల్‌)లో వివరించింది. నిబంధనల ప్రకారం బ్యాంకు ఇప్పటికే రూ.215.21 కోట్లను కేటాయించింద’ని అందులో తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.