close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డెలివరీలో 15వేల సీజనల్‌ ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో 15వేల మంది ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు డెలివరీ సంస్థ తెలిపింది. ఈసారి గతంతో పోలిస్తే.. 100శాతం వృద్ధితో 6.5-7.5 కోట్ల ప్యాకేజీలను డెలివరీ చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది పండగల వేళలో ఇ-కామర్స్‌ సంస్థలు వస్తువులను వినియోగదారులకు అందించేందుకు 3 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని అంచనా. ఇప్పటికే అమెజాన్‌ తాను లక్ష మందికి ఉపాధి అవకాశాలు సృష్టించినట్లు తెలిపింది.  దేశ వ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ బరాసియా తెలిపారు. రాబోయే 18-24 నెలల్లో రూ.300 కోట్లతో మెగా ట్రక్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.