close

తాజా వార్తలు

Published : 30/09/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీడీఆర్‌ జారీలో అవకతవకలు

ఆక్వా లాజిస్టిక్స్‌కు సెబీ రూ.20.65 కోట్ల జరిమానా

దిల్లీ: గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (జీడీఆర్‌) జారీలో అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో ఆక్వా లాజిస్టిక్స్‌, ఆ సంస్థ డైరెక్టర్లు, మరో ముగ్గురు వ్యక్తులకు మొత్తంగా రూ.20.65 కోట్ల జరిమానాను సెబీ విధించింది. 2011 జనవరి - ఫిబ్రవరి మధ్య నిర్వహించిన దర్యాప్తులో కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు తేలడటంతో సెబీ ఈ ఆదేశాలను జారీ చేసింది. 2011 ఫిబ్రవరిలో ఆక్వా లాజిస్టిక్స్‌ 4.112 మిలియన్‌ జీడీఆర్‌లను జారీ చేసింది. వీటి విలువ 6.24 కోట్ల డాలర్లు (సుమారు రూ.460 కోట్లు). ఈ జీడీఆర్‌ ఇష్యూకు ఒకే ఒక్క సంస్థ వింటేజ్‌ ఎఫ్‌జెడ్‌ఈ (ప్రస్తుతం ఆల్టా విస్టా ఇంటర్నేషనల్‌ ఎఫ్‌జెడ్‌ఈగా పిలుస్తున్నారు) దరఖాస్తు చేసుకుంది. యూరోపియన్‌ అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ ఏజీ నుంచి రుణం తీసుకుని ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంది. ఓ వైపు ఆక్వా లాజిస్టిక్స్‌ రుణం తీసుకుని జీడీఆర్‌లను జారీ చేస్తే.. వింటేజ్‌ ఎఫ్‌జెడ్‌ఈ కూడా రుణం తీసుకుని ఈ జీడీఆర్‌లకు దరఖాస్తు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలా మోసపూరిత పద్ధతిలో జీడీఆర్‌ల జారీ జరిగిందని సెబీ కనుగొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.