close

తాజా వార్తలు

Updated : 11/08/2020 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కృత్రిమ మేధతో వ్యాపారాలు విజయవంతం

మైక్రోసాఫ్ట్‌ సర్వే

బెంగళూరు: కృత్రిమ మేధ(ఏఐ)తో నైపుణ్యాలను కలగలపడం ద్వారా కంపెనీలు విజయవంతం అవుతున్నాయని మైక్రోసాఫ్ట్‌ ఇండియా తన పరిశోధనా పత్రంలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలతో కలిసి పనిచేస్తున్న 12,000 మంది నుంచి సమీకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందింది. భారత్‌లోనూ అన్ని పరిశ్రమ విభాగాల్లోని పెద్ద కంపెనీల ఉద్యోగులు, అధిపతులతో ఈ సర్వే నిర్వహించింది. అందులోని ముఖ్యాంశాలు..
* ఏఐ నుంచి తమ వ్యాపారాలు ప్రయోజనం పొందుతున్నాయని 93 శాతం సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు.
* ఏఐ కంపెనీల ఉద్యోగులు తమ నైపుణ్యాలను మరింత పదునుపెట్టుకోవాలని భావిస్తున్నారు.  
* ఏఐ ప్రపంచంలో నైపుణ్యాలు ఉండాల్సిన అవసరాన్ని; ఏఐ అమలు వల్ల కంపెనీలు పొందుతున్న ప్రయోజనాలకు మధ్య లంకె ఉందని అటు ఉద్యోగులు, ఇటు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు విశ్వసిస్తున్నారు.
* వచ్చే 6-10 ఏళ్లలో తమ ఉద్యోగుల్లో సగం మంది ఏఐ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటారని కంపెనీ అధిపతులు భావిస్తున్నారు.
* భారత్‌లో ఏఐపై ఆధారపడ్డ కంపెనీలన్నీ కూడా తమ సిబ్బంది నైపుణ్యాన్ని పెంచే పనిలో ఉన్నాయి. ఈ కంపెనీల్లోని 93 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే తమ నైపుణ్యాలను తిరిగి సానపెట్టుకునే పనిలో ఉన్నామని తెలిపారు.
* నైపుణ్యాలు, ఏఐ కలయిక వల్ల వ్యాపారాలు విజయవంతమవుతాయని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఏఐ అమలు ప్రభావం కనిపిస్తోందని 94 శాతం మంది అంటున్నారు. భారత్‌లోని ఏఐ ఇంటర్మీడియట్‌ కంపెనీలు కూడా ఇదే అభిప్రాయాన్ని(87%) వ్యక్తం చేశాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.