close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్రాంక్లిన్‌ పథకాలకు రూ.4280 కోట్లు

దిల్లీ: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిలిపివేసిన ఆరు పథకాలకు రూ.4280 కోట్లు వచ్చాయి. ఏప్రిల్‌లో ఇవి మూసివేసిన అనంతరం మెచ్యూరిటీలు, ముందస్తు చెల్లింపులు, కూపన్‌ చెల్లింపుల ద్వారా ఆ మొత్తం లభించినట్లు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(ఇండియా) ప్రెసిడెంట్‌ సంజయ్‌ సప్రే పేర్కొన్నారు. ఏప్రిల్‌ 24-జులై31 మధ్య ఈ మొత్తం లభించగా.. అందులో రూ.1005 కోట్లు జులై నెలలో లభించాయని ఆయన వివరించారు. ఇ-ఓటింగ్‌, యూనిట్‌ హోల్డర్స్‌ సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం నగదీకరణ ప్రక్రియలను వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సెబీ ఆడిటర్లకు పూర్తిగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సప్రే తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.