close

తాజా వార్తలు

Published : 03/08/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.13,805 కోట్లతో ఐఓసీఎల్‌ నూతన ప్లాంటు

భువనేశ్వర్‌: జౌళి రంగానికి అవసరమైన ముడిపదార్థాలు తయారు చేసే ప్లాంటును ఒడిశాలోని పారదీప్‌లో రూ.13,805 కోట్లతో నెలకొల్పనున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) ప్రకటించింది. 2024కు ఈ ప్లాంటు నిర్మాణం పూర్తవుతుంది. ఐఓసీఎల్‌ రిఫైనరీకి అనుబంధంగా పారాక్సిలిన్‌ (పీఎక్స్‌), శుద్ధిచేసిన టెరిఫ్థాలిక్‌ యాసిడ్‌ (పీటీఏ) ప్లాంటును అక్కడ ఏర్పాటు చేస్తారు. పీఎక్స్‌ను ఏడాదికి 8 లక్షల టన్నుల మేర ఈ ప్లాంటులో తయారు చేయొచ్చు. పీఎక్స్‌ వినియోగించి ఏడాదికి 12 లక్షల టన్నుల పీటీఏ తయారు చేస్తారు. పాలిస్టర్‌ తయారీకి అవసరమైన ముడిపదార్థమే పీటీఏ అని ఐఓసీఎల్‌ వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.