close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 16/07/2020 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా కవచ్‌ ప్రీమియంలో వైద్య సిబ్బందికి 5 శాతం రాయితీ

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన కరోనా కవచ్‌ పాలసీని తీసుకురావాలని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు సూచించింది. దీనికి అనుగుణంగా 30 బీమా సంస్థలు ఈ పాలసీని జులై 10 నుంచి అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ పాలసీకి సంబంధించిన నియమ నిబంధనలన్నీ ఒకే విధంగా ఉండాలని ఐఆర్‌డీఏ తెలిపింది. ప్రీమియం నిర్ణయాధికారం మాత్రం బీమా సంస్థలకే వదిలిపెట్టింది. అయితే, ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో కరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు ఈ కరోనా కవచ్‌ పాలసీ ప్రీమియంపై 5 శాతం రాయితీ అందించాలని బీమా సంస్థలకు నియంత్రణ సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. వారి సేవలకు గుర్తింపుగా ఈ రాయితీ ఇవ్వాలని సూచించింది. పాలసీ తీసుకునే సమయంలోనే ఈ తగ్గింపును వర్తింపజేయాలని తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.