close
Array ( ) 1

తాజా వార్తలు

కార్పొరేట్ల విరాళాలు

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు ప్రభుత్వరంగ, కార్పొరేట్‌ సంస్థలు విరాళాలతో మద్దతు తెలుపుతున్నాయి. ఇందుకోసం ప్రారంభించిన పీఎం కేర్స్‌ నిధికి తమ సాయాన్ని జమచేస్తున్నాయి. మరికొంత మొత్తాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకూ అందిస్తున్నాయి.
* నాల్కో సంస్థ రూ.5 కోట్లు, సంస్థ ఒకరోజు వేతనం రూ.2.6 కోట్లు (మొత్తం రూ.7.6 కోట్లు) పీఎం కేర్స్‌కు జమచేసింది.
* డాబర్‌ ఇండియా .. రూ.11 కోట్లు పీఎంకేర్స్‌కు ఇస్తోంది. మరో రూ.10 కోట్లతో దేశవ్యాప్తంగా పోలీసులకు ఫేస్‌మాస్క్‌లు, శానిటైజర్లు, అత్యవసర ఔషధాలు అందించేందుకు, వలస కార్మికులకు రోజుకు 2,500 మందికి భోజనానికి వినియోగిస్తామని తెలిపింది.
* జేఎం ఫైనాన్షియల్‌ .. రూ.15 కోట్లు పీఎం కేర్స్‌కు ఇస్తోంది. మరో రూ.15 కోట్లతో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది.
* ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా రూ.2.5 కోట్లను పీఎంకేర్స్‌ నిధికి ప్రకటించింది.


ఉచిత సర్వీస్‌, వారెంటీ గడువు పొడిగింపు

హీరో మోటోకార్ప్‌ : మార్చి 21-ఏప్రిల్‌ 30 మధ్య గడువు ముగిసే ఉచిత సర్వీస్‌ కాలావధిని 2020 జూన్‌ 30 వరకు  పొడిగిస్తున్నాం. ఇదేవిధంగా లాక్‌డౌన్‌ సమయంలో ముగిసే వారెంటీ గడువును కూడా జూన్‌ 30వరకు కొనసాగిస్తున్నాం.


భారత్‌లో తొలివాహనం 2021లో ఆవిష్కరిస్తాం: గ్రూపె పీఎస్‌ఏ

ఈ ఏడాదిలో భారత్‌లో ఆవిష్కరించాలని భావించిన సీ5 ఎయిర్‌క్రాస్‌ (ఎస్‌యూవీ) వాహనాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి వాయిదా వేసినట్లు ఐరోపా వాహన దిగ్గజం గ్రూపె పీఎస్‌ఏ వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్త వల్ల ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది.


రూ.50 కోట్లతో సహాయ కార్యక్రమాలు: ఐషర్‌ గ్రూప్‌

ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుతో పాటు కరోనాపై పోరాటానికి రూ.50 కోట్లు వెచ్చిస్తామని ఐషర్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ సేవల సిబ్బందికి అవసరమైన వస్తువులు సమకూరుస్తామని తెలిపింది. వైద్య పరికరాలకు 3-డి ప్రింటింగ్‌ వంటి సాంకేతికతలను అందుబాటులోకి తెస్తామంది. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు  కేటాయిస్తామని తెలిపింది. ఆహారం, పారిశుద్ధ విధులకు కావాల్సిన వస్తువులూ సరఫరా చేస్తామని వివరించింది.


వైద్యులకు ఫేస్‌ షీల్డ్‌లు: ఫోర్డ్‌ ఇండియా

కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల సిబ్బంది రక్షణ కోసం ఫేస్‌ షీల్డ్‌లను తమ చెన్నై, సనంద్‌ ప్లాంట్లలో తయారు చేయిస్తామని ఫోర్డ్‌ ఇండియా ప్రకటించింది. ఫోర్డ్‌ ఇంజినీర్లు వీటికి రూపకల్పన చేసినట్లు తెలిపింది.


రూ.1800కే కరోనా నిర్థారణ పరీక్ష: థైరోకేర్‌

రోగ నిర్థారణ పరీక్షలు చేసే గొలుసుకట్టు కేంద్రాల సంస్థ థైరోకేర్‌, కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) నిర్థారణ పరీక్షల ధరలను తగిస్తున్నట్లు తెలిపింది. ఆసుపత్రులకు రూ.1800 నుంచి, వ్యక్తుల ఇళ్ల వద్ద నుంచి సేకరణకు రూ.3500 నుంచి, బృందాలుగా అయితే ఒక్కొక్కరికి రూ.2500 నుంచి అవుతుందని ప్రకటించింది. ఇంటి నుంచి సేకరణకు వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ అవసరమని స్పష్టం చేసింది.


నెలపాటు ఉచితంగా వాహనబీమా: ఆక్కో జనరల్‌ ఇన్సూరెన్స్‌

తమ ఖాతాదార్లకు నెలపాటు వాహన బీమా ఉచితంగా కల్పిస్తున్నట్లు ఆక్కో జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో, నెలరోజుల పాటు కార్లు/బైక్‌లు వినియోగించే పరిస్థితి లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. ప్రస్తుత వాహన బీమా ఖాతాదారులు రెన్యువల్‌ చేయించుకున్నా, కొత్తగా బీమా చేయించుకునే వారికి అయినా అదనంగా నెలరోజుల బీమా లభిస్తుందని వివరించింది.


అత్యవసరాల సరఫరాకు 5 విమానాలు: స్పైస్‌జెట్‌

దేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసరాలు, వైద్య సామగ్రిని 5 విమానాల్లో మంగళవారం సరఫరా చేసినట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది. బోయింగ్‌ 737 విమానంలోనే వీటిని తీసుకు వెళ్లినట్లు తెలిపింది. దిల్లీ-చెన్నై, చెన్నై-సూరత్‌, చెన్నై-ముంబయి, ముంబయి-దిల్లీ మార్గాల్లోఇవి ప్రయాణించినట్లు వెల్లడించింది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి 1400 టన్నులకు పైగా కార్గో సరఫరా చేసినట్లు తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.